కాల్ మనీ వ్యవహారంపై హెచ్ఆర్సీలో పిటిషన్ | pitition filed in human rights comission on call money issue | Sakshi
Sakshi News home page

కాల్ మనీ వ్యవహారంపై హెచ్ఆర్సీలో పిటిషన్

Published Mon, Dec 14 2015 4:40 PM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

pitition filed in human rights comission on call money issue

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కాల్ మనీ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. న్యాయవాది అరుణ్ కుమార్ ఈ మేరకు హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశారు. కాల్ మనీ కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, స్వతంత్ర దర్యాప్తు సంస్థచే విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని హెచ్ఆర్సీని కోరారు.

కాగా, కాల్ మనీ వ్యవహారంపై జనవరి 18 లోగా సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని  సోమవారం హెచ్ఆర్సీ ఆదేశించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement