14న వైజ్ఞానిక ప్రయోగ సామర్థ్య పరీక్ష
14న వైజ్ఞానిక ప్రయోగ సామర్థ్య పరీక్ష
Published Mon, Aug 1 2016 2:16 AM | Last Updated on Sat, Apr 6 2019 8:49 PM
విద్యారణ్యపురి : ‘విజ్ఞాన భారతి అన్వేషిక’ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైజ్ఞానిక ప్రయోగ సామర్థ్య ప్రిలిమినరీ టెస్ట్‌ను ఆగస్టు 14న హన్మకొండలో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ జిల్లా కన్వీనర్ సత్తు రామనాథం తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ హెచ్.సి.వర్మ పర్యవేక్షణలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. శాస్త్ర, సాంకేతిక ప్రయోగాలు చేయడంలో విద్యార్థులకు మెలకువలను నేర్పడమే దీని లక్ష్యమన్నారు. జిల్లాలో 9వతరగతి నుంచి డిగ్రీ ఫైనలీయర్ వరకు చదువుతున్న విద్యార్థులు పరీక్షకు అర్హులన్నారు. ప్రతి పాఠశాల, కళాశాల నుంచి ఐదుగురు విద్యార్థుల చొప్పున ఆగస్టు 10లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకు 9866856373, 9948099462, 9177571379 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. ఎంపికయ్యే వారు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శాస్త్రవేత్త జితేందర్‌సింగ్, విజ్ఞాన భారతి రాష్ట్ర కార్యదర్శి నర్సింహమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్, ఆనందం, సదానందం, రామయ్య, శశికళాధర్, సంతోష్, కుమారస్వామి, దామోదర్ పాల్గొన్నారు.
Advertisement