కరుణాపురం ‘క్రీస్తుజ్యోతి’కి అంతర్జాతీయ గుర్తింపు  | International Recognition Of Karunapuram Kristu Jyoti Mandir | Sakshi
Sakshi News home page

కరుణాపురం ‘క్రీస్తుజ్యోతి’కి అంతర్జాతీయ గుర్తింపు 

Published Mon, Jun 19 2023 8:13 AM | Last Updated on Mon, Jun 19 2023 8:35 AM

International Recognition Of Karunapuram Kristu Jyoti Mandir - Sakshi

ధర్మసాగర్‌: హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం కరుణాపురం శివారులోని ‘క్రీస్తుజ్యోతి’ప్రార్థన మందిరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కరుణాపురంలో 40 వేల మంది కూర్చొని ఏకకాలంలో ప్రార్థనలు చేసే అతిపెద్ద చర్చి నిర్మాణం చేపట్టినందుకు డెన్నీ కె.డెవిస్‌ పీస్‌ 2023 అవార్డును సాధించింది. అమెరికన్‌ మల్టీ ఎత్నక్‌ కోయలిషన్‌ 7వ కాంగ్రేషనల్‌ మల్టీ ఎత్నక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో సొసైటీ ఆఫ్‌ క్రైస్ట్‌ ప్రెసిడెంట్‌ క్రీస్తుజ్యోతి మినిస్ట్రీ ఫౌండర్‌ డాక్టర్‌ సంగాల పాల్సన్‌కు ఆదివారం ఆ అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా పాల్సన్‌ మాట్లాడుతూ..తమను గుర్తించి అవార్డు ఇచి్చన సంస్థకు ధన్యవాదాలు తెలుపుతూ సంస్థ మరింత అభివృద్ధిలోకి రావాలని ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఈ అవార్డు రావడంపై సొసైటీ ఆఫ్‌ క్రైస్ట్‌ జనరల్‌ సెక్రటరీ రెవ డాక్టర్‌ జయప్రకాశ్‌ గోపు హర్షం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement