హిమాచల్ ప్రదేశ్ లో లార్జీ డ్యామ్ వద్ద ఉల్లాసంగా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఫోటోలు దిగుతున్న విజ్ఞాన్ జ్యోతి కాలేజీ విద్యార్ధులు క్షణాల్లో ఎలా జలసమాధి అయిపోయారో చూపించే విడియోను ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ దినపత్రిక అమర్ ఉజాలా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడం జరిగింది. ఆనందం క్షణాల్లో ఎలా విషాదంగా మారిపోయిందో ఆ విడియోను చూస్తే అర్థమవుతుంది. స్థానికులు ఈలలు వేసి, హెచ్చరిస్తున్న దృశ్యాలను, శబ్దాలను కూడా చూడొచ్చు.