విద్యార్థుల ఆచూకీ కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రిని కోరినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ : బియాస్ నదిలో గల్లంతు అయిన విద్యార్థుల ఆచూకీ కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రిని కోరినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. నేవీ సిబ్బందిని రంగంలోకి దింపాలని ఆయన బుధవారమిక్కడ డిమాండ్ చేశారు. శాటిలైట్ ద్వారా ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. మరోవైపు బియాస్ నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఆరు మృతదేహాలు లభించిన విషయం తెలిసిందే.