మే 10 నుంచి కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్: బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గుంటూరు జిల్లా వడ్ల మూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన వీశాట్–2017(విజ్ఞాన్ స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్) ఫలితాలను ఆ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గురువారం విడుదల చేశారు. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన 42 వేల మందికి పైగా విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీల కంటే ముందుగా ప్రవేశ పరీక్ష నిర్వహించడంతో పాటు వారం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామ న్నారు. మే 10 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి, జూన్ మొదటివారంలో తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు.
తొలి పది ర్యాంకర్లు వీరే...
విజ్ఞాన్ వర్సిటీ వీసీ బి.రామ్మూర్తి మాట్లాడుతూ.. వీశాట్‌లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన బట్టు శ్రీచరణ్ మొదటి ర్యాంకు సాధించినట్లు చెప్పారు. కొవ్వూరుకు చెందిన పెదవేగి శశినందన్ రెండో ర్యాంకు, తణుకు చెందిన గరిమెళ్ల మోహన్‌రఘు మూడో ర్యాంకు, తూర్పు గోదావరి జిల్లా గంటికి చెందిన కంచర్ల బాలాజీ శ్రీ హర్ష నాలుగో ర్యాంక్, మేడపాడుకు చెందిన ఎలుబండి వీరేంద్ర సాయి ఐదో ర్యాంకు, గుంటూరు జిల్లాకు చెందిన గోరంట్ల జయంత్ హర్ష ఆరో ర్యాంకు, పెనుమంత్రకు చెందిన కొక్కిరాల జ్వాలాఈశ్వర్‌ప్రసాద్ 7వ ర్యాంకు, నల్లజెర్లకు చెందిన గండ్రకోటి గంగాధర రామకృష్ణ 8వ ర్యాంకు, భీమవరానికి చెందిన ఎ.హర్షిత్ 9వ ర్యాంకు, వేలివెన్నుకు చెందిన జి.శ్రీనివాస్ 10వ ర్యాంకు సాధించారని తెలిపారు.
ప్రతిభకు ప్రోత్సాహం...
డీన్ రవికుమార్ మాట్లాడుతూ.. వీశాట్‌తో పాటు ఇంటర్ మార్కులు, ఐఐటీ జేఈఈ, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా కూడా విజ్ఞాన్స్ వర్సిటీలోని బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఐటీ సర్వీసెస్ డీన్ ప్రొఫెసర్ కె.వి.కృష్ణకిషోర్ మాట్లాడుతూ.. ప్రతిభావంతులకు ఫీజు రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. వీశాట్ ఫలితాల కోసం vifna nuniverrity.org వెబ్‌సైట్‌తో పాటు టోల్‌ఫ్రీ నం.1800 425 2529ను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో విజ్ఞాన్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఇంజినీరింగ్ అండ్ మేనేజిమెంట్ డీన్ డాక్టర్ వి.మధుసూదన రావు తదితరులు పాల్గొన్నారు.
‘విజ్ఞాన్’ వీశాట్ ఫలితాలు విడుదల
Published Fri, Apr 28 2017 2:52 AM | Last Updated on Sat, Apr 6 2019 8:49 PM
Advertisement
Advertisement