బెజవాడలో చైన్స్నాచింగ్ కలకలం రేపింది.
విజయవాడ: బెజవాడలో చైన్స్నాచింగ్ కలకలం రేపింది. భవానీపురం బ్యాంక్ సెంటర్లో ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసును తెంపుకుపోయాడు. దీంతో బాధిత మహిళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పట్టించుకోవడంలేదని సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.