కరీంనగర్ జిల్లాలో చైన్ స్నాచింగ్ కలకలం | chain snatching in karimnagar district | Sakshi
Sakshi News home page

కరీంనగర్ జిల్లాలో చైన్ స్నాచింగ్ కలకలం

Published Wed, Jan 20 2016 4:11 PM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

chain snatching in karimnagar district

కమలాపూర్: కరీంనగర్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది. కమలాపూర్ మండలం సిరికొండ శివారులో ఆటోలో వెళుతున్న ఓ మహిళ మెడలోని పుస్తెలతాడును చైన్ స్నాచర్స్ తెంపుకుపోయారు.

నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై ఆటోను అనుసరించారు. అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మెడలోంచి సుమారు 2 తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement