పుట్టిన 28 రోజులకే రూ. 24 లక్షలు
దుబాయ్: ‘కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్న’ చందాన పుట్టిన 28 రోజులకే ఓ పాప తన కుటుంబానికి లక్షల రూపాయల విలువైన బహుమతులను సాధించి పెట్టింది. నవజాత శిశువు నితేరా బారసాల కోసం ఆమె తండ్రి అనిల్ జనార్దనన్ (కేరళవాసి) 2 దిర్హమ్‌ల (సుమారు 34 వేల) విలువైన బంగారు చైన్, గాజుల్ని దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌లో తీసుకున్నారు. ఈ సందర్భంగా మూడు కూపన్లు ఆ పాప పేరు మీద నింపారు. అదే వారికి కనకవర్షం కురిపించింది. నితేరా షాపింగ్ ఫెస్టివల్‌లో విజేతగా నిలిచింది. లక్షా 40 వేల దిర్హమ్‌ల (రూ. 24 లక్షలు) విలువైన బంగారు, వజ్రాల నగలను సాధించింది.