రెచ్చిపోయిన దొంగలు
Published Wed, Sep 21 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
మహిళల మెడల్లో బంగారు గొలుసుల అపహరణ
అనంతపురం సెంట్రల్/ రాప్తాడు : నగర శివారు, రాప్తాడు మండల పరిధిలో ఇద్దరు దొంగలు మంగళవారం రెచ్చిపోయారు. తమకు అడ్డొచ్చేవారు ఎవరున్నారనుకున్నారో ఏమో వరుసగా ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్ళారు. ఈ ఘటనలు రాప్తాడు– జేఎన్టీయూ కళాశాల మధ్యన జరిగాయి. జేఎన్టీయూ కళాశాల ఎదురుగా హోటల్నిర్వహిస్తున్న వెంకటలక్ష్మి మెడలోని 5 తులాల బంగారు చైన్ను లాక్కెళ్లారు.
ద్విచక్రవాహనంపై వచ్చిన దొంగలు చాకచక్యంగా గొలుసుతో ఉడాయించారు. బాధితురాలు వన్టౌన్ఎస్ఐ వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లిలో మంగళవారం ఉదయం ట్యూషన్నుంచి పిల్లలను పిలుచుకొచ్చేందుకు ఇంటి నుంచి బయల్దేరిన మమత మెడలో బంగారు గొలుసును పల్సర్బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలు రాప్తాడు ఎస్ఐ ధరణిబాబుకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement