నీళ్లకోసమని వెళ్లి బంగారు గొలుసు లాక్కెళ్లాడు | chine snatcher robs gold chain from a woman | Sakshi
Sakshi News home page

నీళ్లకోసమని వెళ్లి బంగారు గొలుసు లాక్కెళ్లాడు

Published Tue, Jan 10 2017 8:18 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

నీళ్లకోసమని వెళ్లి బంగారు గొలుసు లాక్కెళ్లాడు

నీళ్లకోసమని వెళ్లి బంగారు గొలుసు లాక్కెళ్లాడు

హైదరాబాద్‌: ముఖాలు కనిపించకుండా మాస్కులు వేసుకుని.. మహిళల బంగారు చైన్లు లాగేసే చైన్‌ స్నాచర్స్‌ ఓ అడుగు ముందుకేసినట్లున్నారు. రోడ్లపై వెళ్లే మహిళలను టార్గెట్‌ చేసే స్నాచర్స్‌... ఇప్పుడు ఇళ్లల్లో ఒంటరిగా ఉన్న ఆడవాళ్లను వదిలిపెట్టడంలేదు. నగరంలోని కుషాయిగూడలోని శ్రీరాంనగర్‌లో మంగళవారం మధ్యాహ్నం అలాంటి ఘటననే చోటు చేసుకుంది.

రత్నదేవి అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ దుండగుడు మంచినీళ్ల కోసమని వెళ్లాడు. ఆమె నీళ్లు తీసుకుని రాగా.. దుండగుడు ఆమె మెడలోని ఏడు తులాల బంగారు గొలుసును లాక‍్కెళ్లిపోయాడు. దీంతో ఆమె లబోదిబోమంటూ కేకలు వేసింది. ఆ సమయంలో చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో స్నాచర్‌ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement