
ప్రతీకాత్మక చిత్రం
న్యూశాయంపేట/వరంగల్ : వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి కందకాలు తీస్తుండగా బంగారు గొలుసు బయటపడింది. దీని పంపకం విషయమై కూలీల గొడవతో విషయం బయటపడగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు... బొమ్మలగుడి ప్రాంతానికి చెందిన గొలికారి రమేష్ పాత ఇంటి స్థానంలో నూతన నిర్మాణ పనులను బిల్డర్‌కు అప్పగించాడు. ఆయన కాట్రపల్లికి చెందిన కూలీలతో బుధవారం కందకాలు తవ్విస్తుండగా మూడున్నర తులాల బంగారు గొలుసు బయటపడింది.
అయితే, గొలుసు పంపకంపై కూలీలు గొడవ పడుతుండగా ఆనోట ఈనోట విషయం బయటపడింది. దీంతో ఎస్‌ఐ సతీష్ చేరుకుని కూలీలు విచారించి గొలుసు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పాత ఇళ్లు 30 నుంచి 40 ఏళ్ల క్రితం నిర్మించిన నేపథ్యంలో తమ పూర్వీకులు ఇంకా ఏమైన ఆభరణాలు దాచిపెట్టారా అనే అనుమానాల్ని యజమాని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment