వాళ్లు లాక్కెళ్లింది బంగారు గొలుసు కాదట! | rold gold chian theft by chain snatchers | Sakshi
Sakshi News home page

వాళ్లు లాక్కెళ్లింది బంగారు గొలుసు కాదట!

Published Sat, Apr 9 2016 9:08 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

rold gold chian theft by chain snatchers

చాంద్రాయణగుట్ట: చైన్ స్నాచింగ్ జరిగిన 24 గంటల్లోనే దక్షిణ మండలం పోలీసులు సీసీ టీవీ కెమెరాల సాయంతో నిందితులను కటకటాల్లోకి పంపారు. కాగా నిందితులు లాక్కెళ్లింది రోల్డ్ గోల్డ్ అని తేలింది. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలివీ.. డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోదేఅలీషా కిడికీ ప్రాంతంలో ఈ నెల 7వ తేదీన ఒంటరిగా నడిచి వెళుతున్న కొప్పెర్ల రాణి (26) మెడలోని మంగళ సూత్రాన్ని బైక్‌పై వచ్చిన యువకులు తెంచుకు పోయారు.

దీనిపై డబీర్‌పురా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, స్థానికంగా ఉన్న మసీదు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో నిందితులు పారిపోతున్నట్లు వీడియో ఫుటేజి లభించింది. దీని ఆధారంగా నిందితులను పహాడీషరీఫ్ షాయిన్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ తల్హా అలియాస్ అహ్మద్ (23), తలాబ్‌కట్టా అమన్‌నగర్ బి ప్రాంతానికి చెందిన ఉమర్ బిన్ ఆబేద్ అలియాస్ ఉమర్ ఖాన్(21)గా గుర్తించారు. ఇటీవలే సౌదీ నుంచి వచ్చిన వీరు తాగుడు డబ్బుల కోసం చైన్ స్నాచింగ్ చేశారు. అయితే, ఆ చైన్ బంగారంది కాదని తెలుసుకున్న నిందితులు కంగు తిన్నారు. నిందితుల నుంచి లాక్కెళ్లిన గొలుసుతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement