ఒంటరిగా వెళ్తే గొలుసు గోవిందా !
తాళి బొట్టుకు రక్షణ కరువైంది. మెడలో బంగారం వేసుకుంటే చాలు దొంగలు ఎగబడుతున్నారు. పట్టపగలే బంగారు గొలుసులను లాక్కుని బైకులపై దర్జాగా పారిపోతున్నారు. వారానికో చైన్‌స్నాచింగ్ జరుగుతుండడంతో మహిళలు నగలు ధరించి గడపదాటాలంటేనే వణుకుతున్నారు.
కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో మూడు నెలల కాలంలో పదికి పైగా చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. ఇళ్ల ముందు నిల్చున్నా, రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నా దొంగలు మహిళల మెడలోని గొలుసులపై కన్నేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి గేటుదాటి బయటకు వచ్చిన గజవాడ సుగుణ అనే మహిళ మెడలో నుంచి ఆరు తులాల బంగారు గొలుసులను దొంగలు లాక్కు ని పరారయ్యారు.
దొంగలు ఒక్కసారి గా ఆమె మెడలో నుంచి చైన్ లాగడంతో కిందపడిపోయి అరిచినా లాభం లేకుం డా పోయింది. మూడు రోజుల క్రితం కామారెడ్డి పట్టణానికి సమీపంలోని నర్సన్నపల్లి చౌరస్తా వద్ద ఆటోలో వస్తు న్న మహిళ మెడలో నుంచి గొలుసును లాక్కున్నారు. అంతకన్నా వారం రోజు ల ముందు పట్టణంలోని విద్యానగర్ కా లనీలో లక్ష్మి అనే మహిళ మెడలో నుంచి చైన్‌ను లాక్కుని పరారయ్యారు. ఇలా వరుసగా కామారెడ్డి పట్టణంలో గొలు సు దొంగతనాలు జరుగుతున్నాయి.
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా....
గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటు న్నా ఫలితం కనిపించడం లేదు. పోలీ సులు తనిఖీలు నిర్వహిస్తున్నా దొంగలు మాత్రం ఎక్కడో ఒక చోట తమ పని కానిచేస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న కాలనీలు, వీధుల్లోనే ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. రోడ్లపై జనసంచారం లేని ప్రాంతాలను ఎంచుకుని దొంగలు మహిళల మెడలో నుంచి చైన్‌లు లాక్కెళుతున్నారు. చైన్ స్నాచర్లు, దొంగలను పోలీసులు అరెస్టు చేసినట్టు చూపుతున్నా చోరీలు మాత్రం ఆగడం లేదు.
పెళ్లిళ్ల సీజన్‌లో పెరిగిన చోరీలు...
మహిళలు సాధారణంగా తాళిబొట్టుతో ఉన్న బంగారు గొలుసును రెగ్యులర్‌గా ధరిస్తారు. అదే శుభ ముహూర్తాల సమయంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లే సమయంలో తమకు ఉన్న ఆభరణాలన్నిటినీ ధరించడానికి ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మహిళలు నగలు ధరించి వెళ్లే సందర్భంలో చైన్ స్నాచింగులు జరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. తమ వెంట మగవారు లేకుండా బయటకు వెళ్లడానికి జంకుతున్నారు.
మరింత నిఘా అవసరం
పట్టణంలో పెరిగిన దొంగతనాల నివారణకు పోలీసులు మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మూ డు జిల్లాల కూడలి కావడం వల్ల ఇక్కడి కి నిత్యం వేలాది మంది ప్రజలు వచ్చిపోతుంటారు. అయితే అనుమానితులపై నిఘా ఉంచి వారిని ప్రశ్నించడం ద్వారా కొంత వరకు దొంగతనాలను అరికట్టవచ్చని అంటున్నారు. పాత నేరస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఆరు తులాలు..
కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని వివేకానంద కాలనీలో గురువారం ఉదయం ఓ మహిళ మెడలో నుంచి బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆరు తులాల గొలుసులను లాక్కెళ్లారు. ఇంటి గేటు నుంచి బయటకు వచ్చిన గజవాడ సుగుణ వద్దకు వచ్చిన యువకుడు మెడలో నుంచి బంగారు గొలుసులను లాక్కున్నాడు. బలంగా లాగడంతో సుగుణ కిందపడిపోయింది.చైన్ లాక్కున్న దొంగలు బైకుపై పరారయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.