దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భార్యాభర్తలపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడిచేసి భర్తను దారుణంగా గొంతుకోసి చంపారు.
సాక్షి, హైదరాబాద్: దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భార్యాభర్తలపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడిచేసి భర్తను దారుణంగా గొంతుకోసి చంపారు. ఈ దాడిలో భార్య తీవ్రంగా గాయుపడింది. ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును దుండగులు అపహరించుకుపోయారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ దారుణం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ జేబీఎస్ డిపోలో మెకానిక్‌గా ఉంటున్న మల్కాజిగిరి దుర్గానగర్‌కు చెందిన గాజుల వెంకటేశ్వరరావు (27)కు, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన సౌజన్యతో ఈ ఏడాది మే 29న వివాహం జరిగింది.
దంపతులు శనివారం మోటర్ సైకిల్‌పై సంఘీ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తూ, రాత్రి ఏడున్నర గంటలకు ఉమర్‌ఖాన్‌గూడ దాటిన తర్వాత రోడ్డు పక్కన ఆగారు. అక్కడే పొంచిఉన్న ముగ్గురు దుండగులు వారిపై కత్తులతో దాడిచేసి, వెంకటేశ్వరరావును గొంతుకోసి అతి దారుణంగా చంపారు. దాడిలో సౌజన్య తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని గవునించిన స్థానికులు పోలీసులకు సవూచారం ఇచ్చారు. సౌజన్య మెడలో బంగారు గొలుసు లాక్కుంటున్న దుండగులు.. తవును ప్రతిఘటించిన వెంకటేశ్వరరావుపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయుపడిన సౌజన్యను హయత్‌నగర్‌లోని టైటన్ ఆసుపత్రికి తరలించారు. దుండగులు బంగారంకోసమే దాడి చేశారా?. మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.