రంగారెడ్డి జిల్లా కీసర మండలం కరీంగూడలో సోమవారం మధ్యాహ్నం ఓ మహిళ మెడలోని పుస్తెల తాడును దుండగుడు అపహరించుకుపోయాడు.
కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం కరీంగూడలో సోమవారం మధ్యాహ్నం ఓ మహిళ మెడలోని పుస్తెల తాడును దుండగుడు అపహరించుకుపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. మంజుల(30) అనే వివాహిత ఇంట్లో టీవీ చూస్తుండగా మధ్యాహ్నం 1 గంట సమయంలో ఓ దుండగుడు తలుపు తట్టాడు.
మంజుల తలుపు తీయడం ఆలస్యం ఆమె ముఖంపై మత్తుమందు చల్లి, మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకుని పరారయ్యాడు. అయితే అదే సమయంలో ఇంట్లో ఉన్న మంజుల భర్త భాస్కర్‌రెడ్డి, మామ రాజారెడ్డి అప్రమత్తమై దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేసినా అతడు చిక్కలేదు. దీనిపై బాధితులు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు.