రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలోని ఎస్‌బీహెచ్ ఏటీఎంలో సోమవారం రాత్రి దుండగులు దొంగతనానికి విఫలయత్నం చేశారు.
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలోని ఎస్‌బీహెచ్ ఏటీఎంలో సోమవారం రాత్రి దుండగులు దొంగతనానికి విఫలయత్నం చేశారు. మిషన్‌ను పగులగొట్టి, డబ్బులు తీసుకునేందుకు చేసిన ప్రయత్నం సఫలం కాకపోవటంతో వెనుదిరిగారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు మంగళవారం ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. కాపలా లేని ఈ ఏటీఎం కేంద్రంలోని సీసీ కెమెరా ఫుటేజిలను పరిశీలిస్తున్నారు.