సికింద్రాబాద్ : ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి మహిళ దృష్టి మరల్చి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ సంఘటన సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌద్ధ నగర్ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం సమయంలో అపార్ట్‌మెంట్‌లో అద్దె ఇల్లు దొరుకుతుందా అని స్థానిక మహిళను అడిగిన ఇద్దరు దుండగులు ఆమె దృష్టి మరల్చి ఆమె మెడలోని రెండు తులాల మంగళ సూత్రాన్ని లాక్కెళ్లారు. కాసేపటికి ఇది గుర్తించిన మహిళ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.