chilkalguda
-
Hyderabad: అత్యంత విలువైన రైల్వే భూముల్లో రియల్ దందా
సాక్షి, హైదరాబాద్: అత్యంత విలువైన రైల్వే భూముల్లో రియల్ దందా పరుగులు తీస్తోంది. జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల్లో దక్షిణమధ్య రైల్వేకు ఉన్న ఖరీదైన భూములను కారుచౌకగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజాం కాలంలోనే రైల్వేల కోసం వందల ఎకరాల భూమిని కేటాయించారు. రైల్వే కార్యాలయాలు, ఉద్యోగులు, అధికారుల నివాసాల కోసం సికింద్రాబాద్‌లోని అనేక చోట్ల రైల్వేకు విలువైన స్థలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూములను నిరర్థక ఆస్తుల ఖాతాలో చేర్చి అతి తక్కువ మొత్తానికి బడా రియల్ సంస్థలు, భవన నిర్మాణ సంస్థలకు ధారాదత్తం చేయడం పట్ల ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు రైల్వే భూములను లీజుకు ఇవ్వడంలో రైల్వేకు, ప్రైవేట్ సంస్థలకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) నిబంధనలను అమలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ నివాస సదుపాయాలను ఏర్పాటు చేయకుండానే రీబిల్డింగ్ పేరిట ఉద్యోగుల క్వార్టర్స్ భవనాలను కూల్చివేయడం దారుణమని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. 21 ఎకరాలపై రూ.200 కోట్లు.. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఉన్న చిలకలగూడ రైఫిల్ రేజ్ క్వార్టర్స్, మెట్టుగూడ రైల్వే కల్యాణ మండపానికి సమీపంలో ఉన్న మరో విలువైన స్థలాన్ని ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారు. ఈ రెండు చోట్ల కలిపి దక్షిణమధ్య రైల్వేకు సుమారు 21 ఎకరాల భూమి ఉంది. చిలకలగూడలో ఉన్న 18 ఎకరాల స్థలాన్ని 99 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. దీనిపై రూ.170 కోట్లు, మెట్టుగూడలోని మరో 3 ఎకరాలను కూడా 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా సుమారు రూ.30 కోట్ల చొప్పున లభించనున్నట్లు అంచనా. ► ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) ఏర్పడిన సంగతి తెలిసిందే. రైల్వే స్థలాలను సేకరించి బడా నిర్మాణ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ఆర్ఎల్డీఏ ప్రణాళికలను రూపొందించింది. మొదట్లో వ్యాపార, వాణిజ్య భవనాల కోసం మాత్రమే లీజుకు ఇవ్వాలని భావించారు. కానీ పెద్దగా స్పందన లభించలేదు. ఈ భూములను అతి తక్కువ ఆదాయానికి ఏకంగా 99 ఏళ్లకు లీజుకు ఇవ్వడం పట్ల కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ► మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఈ భూమిపై రైల్వేకు లీజు ద్వారా వచ్చే ఆదాయం కూడా కేవలం రూ.200 కోట్లు మాత్రమే. గ్రేటర్ హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ వంటి ప్రభుత్వ సంస్థలు, పలు ప్రైవేట్ సంస్థలు అతి తక్కువ భూమిలో వేల కోట్ల రూపాయల వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తుండగా రైల్వే భూములను మాత్రం అతి తక్కువ ఆదాయానికి లీజుకు ఇవ్వడం దారుణమని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. పైగా గతంలో లీజు కాలపరిమితి కేవలం 49 ఏళ్లు ఉంటే ఇప్పుడు దానిని 99 ఏళ్లకు పెంచడాన్ని కూడా ఉద్యోగులు, కార్మికులు మండిపడుతున్నారు. ప్రైవేట్ సంస్థలు రైల్వే ఆస్తులను కొల్లగొట్టడం మినహా మరొకటి కాదని ఎంప్లాయీస్ సంఘ్ నేత ఒకరు తెలిపారు. ► ప్రస్తుతం బడా నిర్మాణ సంస్థకు ఈ భూములను కేటాయించడంతో ఉద్యోగుల క్వార్టర్స్‌ను పునర్నిర్మించనున్నట్లు లీజు ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ రైఫిల్ రేజ్ క్వార్టర్స్‌లో ఎలాంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండానే రెండో దశ పాత భవనాల కూల్చివేతలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. (క్లిక్ చేయండి: రైళ్లిక రయ్.. గంటకు 130 కి.మీ. వేగంతో పరుగులు!) ఒకే చోట నివాసాలు ఉండాలి.. వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం అధికారులకు, ఉద్యోగులకు విడివిడిగా నివాసాలను ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం నిరుపయోగ భూములను లీజుకు ఇచ్చే నెపంతో ఉద్యోగుల నివాసాలను తొలగించడం, ప్రస్తుతం ఉన్న చోట కాకుండా మరోచోట నివాసాలు ఏర్పాటు చేయడం సరైంది కాదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. (క్లిక్ చేయండి: చట్టానికి దొరక్కుండా.. ఆన్లైన్ గేమింగ్) -
ఇద్దరి ప్రాణాలు మింగిన ఆట
హైదరాబాద్: ఇద్దరు చిన్నారులు ఆడుకోవడానికి భవనం పైకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి అనంతలోకాలకు వెళ్లిపోయారు. చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన బాధిత తల్లిదండ్రులతోపాటుగా స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పోలీసులు కథనం మేరకు..రైల్వే ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న బీదర్‌కు చెందిన కృష్ణప్రసాద్, రేణుక దంపతులకు ఏడాదిన్నర పాప శ్రావ్య. రైల్వే ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న బాబురావు, సుమిత్ర దంపతుల కుమార్తె పల్లవి (12). ఈ రెండు కుటుంబాలు చిలకలగూడలోని రైల్వే క్వార్టర్ నంబర్ 1010/ 9, 10 ఇళ్లలో నివసిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో చిన్నారి శ్రావ్యతోపాటు పల్లవి ఆడుకుంటూ మూడవ అంతస్తుపైకి వెళ్లారు. టెర్రాస్ పిట్టగోడ ఒకటిన్నర అడుగుల ఎత్తే ఉండటంతో ప్రమాదవశాత్తు శ్రావ్య కిందపడబోయింది. వెంటనే పల్లవి శ్రావ్య గౌను పట్టుకుని గట్టిగా కేకలు వేసింది. కింది అంతస్తులో ఉన్న రేణుక పైకి వచ్చేలోగా గాలిలో వేలాడుతున్న శ్రావ్య గౌను చిరగడంతో పల్లవి వదిలేసింది. దీంతో కింద పార్కింగ్ చేసిన కారుపై శ్రావ్య పడిపోయింది. పైకి వస్తున్న శ్రావ్య తల్లికి పెద్ద శబ్దం వినిపించ డంతో కిందికి పరుగులు తీసింది. అయితే టెర్రాస్‌పైనే ఉన్న పల్లవి బ్యాలెన్స్ కోల్పోయి తలకిందులుగా కిందపడి అక్కడిక్కడే మృతి చెందింది. కారుపై పడిన చిన్నారి శ్రావ్యకు తీవ్ర గాయాలు కావడంతో ద్విచక్ర వాహనంపై లాలాగూడ రైల్వే ఆస్పత్రికి అక్కడి నుంచి కిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రావ్య మృతి చెందింది. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. పరామర్శించిన మంత్రి పద్మారావు: సమాచారం అందుకున్న అబ్కారీమంత్రి తీగుళ్ల పద్మారావు బుధవారం ఉదయం గాంధీ మార్చురీ వద్దకు వచ్చి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలో మృతుల తల్లిదండ్రులు బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను తరలించేందుకు అవసరమైన రవాణా ఖర్చులను మంత్రి పద్మారావు చెల్లించారు. పట్టుకునేందుకు పరిగెత్తా అమ్మా అంటూ పల్లవి కేకలు వినిపించడంతో బయటకు వచ్చి చూశాను. ఎదురుగా ఉన్న క్వార్టర్స్ పై అంతస్తులో శ్రావ్య వేలాడుతూ, ఆమెను పట్టుకుని పల్లవి కనిపించారు. కిందపడితే పట్టుకుందామని పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆలోపే శ్రావ్య కారుపై పడిపోయింది. రెండు అడుగులు వేసేలోగా పల్లవి కూడా తన కాళ్ల వద్దే పడి మృతి చెందింది. బాధగా ఉంది. – హిమబిందు, ప్రత్యక్షసాక్షి ఆస్పత్రికి తరలించా డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాను. ఇంతలో క్షణాల వ్యవధిలో రెండు మార్లు పెద్ద శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూసేసరికి పల్లవి రక్తపుమడుగులో పల్లవి, కారుపై శ్రావ్యలు పడిఉన్నారు. వెంటనే బైక్‌పై వారిద్దరినీ రైల్వే ఆస్పత్రికి తీసుకువెళ్లాను. అప్పటికే పల్లవి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. –కిరణ్‌కుమార్, ప్రత్యక్షసాక్షి -
ఆత్మహత్యకు ముందు.. కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో
-
ప్రియురాలు దూరం పెట్టిందని ఆత్మహత్య
హైదరాబాద్: చిలకలగూడలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. జి.తాని (31) అనే కానిస్టేబుల్(నెం.5130) మోండా మార్కెట్ పీఎస్‌లో పనిచేస్తున్నాడు. ఇంతకుముందు సంతోష్‌నగర్ పీఎస్‌లో పనిచేశాడు. ఐదు నెలల క్రితం చిలకలగూడకి బదిలీ అయ్యాడు. గురువారం రాత్రి డ్యూటీ ఉన్నా వెళ్లలేదు. అర్ధరాత్రి ఇంటికి వచ్చి బెడ్రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. తెల్లవారాక అతడిని నిద్రలేపబోతే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండగా గమనించారు. తాని 2010 బ్యాచ్‌కు చెందిన వాడు. ఆయనకి తలిదండ్రులు, తమ్ముడు ఉన్నారు. నాలుగు నెలల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో తానీకి గాయాలయ్యాయి. అప్పటి నుంచి ప్రియురాలు అతన్ని దూరం పెట్టిందని, దీంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా ప్రేమకు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. తానీ ఓ సెల్ఫీ వీడియోను తీసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
చిలకలగూడలో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్: యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. అభినవనగర్ కాలనీ కమ్యూనిటి హాల్ వద్ద మహమ్మద్ గూడకు చెందిన షరీఫ్(28)ను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చి రోడ్డు పక్కన పడేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
చిలకలగూడలో కార్డాన్ సెర్చ్
-
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి చోరీ
సికింద్రాబాద్ : ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి మహిళ దృష్టి మరల్చి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ సంఘటన సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌద్ధ నగర్ అపార్ట్మెంట్లో మంగళవారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం సమయంలో అపార్ట్మెంట్లో అద్దె ఇల్లు దొరుకుతుందా అని స్థానిక మహిళను అడిగిన ఇద్దరు దుండగులు ఆమె దృష్టి మరల్చి ఆమె మెడలోని రెండు తులాల మంగళ సూత్రాన్ని లాక్కెళ్లారు. కాసేపటికి ఇది గుర్తించిన మహిళ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
హైదరాబాద్‌లో మరో ప్రేమోన్మాది
* కేక్ కట్ చేయాలని పిలిచి.. భవనంపై నుంచి తోసేసిన ప్రియుడు హైదరాబాద్: ప్రేమోన్మాదుల దాడికి యువతులు బలవుతూనే ఉన్నారు. తనను ప్రేమించడం లేదని సోమవారం ఓ ఉన్మాది రవళిని కత్తితో దాడి చే సిన ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ప్రియుడు ఆమె పుట్టినరోజు నాడే హతమార్చేందుకు కుట్ర చేశాడు. కేక్ కట్ చేయాలంటూ భవనంపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి బలవంతంగా తోసేశాడు. అదృష్టవశాత్తు సిమెంట్ రేకులపై పడడంతో బాధితురాలు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చిలకలగూడ చింతబావికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి గడ్డం శ్రీశైలం పెద్దకుమార్తె రూప (21). పదవ తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. జీడిమెట్ల గాజులరామారానికి చెందిన మహ్మద్ సాజిద్ (24)తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం ఇరువురి మధ్య అభిప్రాయబేధాలు పొడచూపాయి. సాజిద్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం వచ్చి... మంగళవారం రూప పుట్టిన రోజు కావడంతో అదేరోజు ఆమెను హతమార్చేందుకు సాజిద్ పథకం సిద్ధం చేసుకున్నాడు. అందులో భాగంగా సాయంత్రం రూప ఇంటికి వచ్చి కేక్ కట్ చేయాలని ఆమెను అపార్ట్మెంట్(మూడంతస్తుల భవనం)పైకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే తనను నిర్లక్ష్యం చేస్తున్నావని ఆగ్రహించిన సాజిద్.. రూప ను బలవంతంగా అక్కడి నుంచి నెట్టివేశాడు. రేకుల షెడ్‌పై పడడంతో రూప తల, మెడకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా, సాజిద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ప్రస్తుతం రూపకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఏడేళ్లుగా ప్రేమిస్తున్న తనను నిర్లక్ష్యం చేస్తూ వేరే వ్యక్తితో చనువుగా ఉండడం భరించలేకే రూపను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు సాజిద్ పోలీసులకు తెలిపాడు. కాగా, సోమవారం ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బీటెక్ విద్యార్థిని రవళి కూడా సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. -
కేసీఆర్‌పై ఓయూ విద్యార్థుల ఆగ్రహం
కేసీఆర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు షాక్ ఇచ్చారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని చిలకలగూడలో జరిగే బహిరంగసభకు హాజరయ్యేందుకు ఓయూ క్యాంపస్‌లోని క్రీడా మైదానంలో కేసీఆర్ హెలికాప్టర్ దిగారు. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న కొందరు విద్యార్థులు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయవద్దని నినాదాలు చేస్తూ.. కేసీఆర్ వైపు దూసుకువచ్చారు. దీంతో కేసీఆర్ కొందరు విద్యార్థులతో ఐదు నిమిషాలు మాట్లాడి.. సభకు వెళ్లకుండా తిరిగి హెలికాప్టర్లో బేగంపేటకు వెళ్లిపోయారు. విద్యార్థులతో మాట్లాడిన విషయాలను తర్వాత మీడియాకు వెల్లడిస్తామన్నారు. కాగా, కేసీఆర్ హెలికాప్టర్ గాలిలోకి ఎగరగానే కొందరు విద్యార్థులు ఆ వైపు చెప్పులు చూపిస్తూ, నినాదాలు చేశారు. -
ఐదు రోజుల పసికందును చంపిన తల్లి
సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో శనివారం దారుణం చోటు చేసుకుంది. ఎయిడ్స్ సోకిందనే అనుమానంతో ఐదు రోజుల పసికందును కన్న తల్లి గొంతు నులిమి చంపింది. కుటుంబసభ్యులు వెంటనే స్పందించి ఆ పసి పాపను ఆసుప్రతికి తరలించారు. అయితే ఆ పాప అప్పటికే మృతి చెందిందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. దాంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ పసి కందు కన్న తల్లిని అదుపులోకి తీసుకున్నారు.