
హైదరాబాద్:
చిలకలగూడలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. జి.తాని (31) అనే కానిస్టేబుల్(నెం.5130) మోండా మార్కెట్ పీఎస్‌లో పనిచేస్తున్నాడు. ఇంతకుముందు సంతోష్‌నగర్ పీఎస్‌లో పనిచేశాడు. ఐదు నెలల క్రితం చిలకలగూడకి బదిలీ అయ్యాడు.
గురువారం రాత్రి డ్యూటీ ఉన్నా వెళ్లలేదు. అర్ధరాత్రి ఇంటికి వచ్చి బెడ్‌రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. తెల్లవారాక అతడిని నిద్రలేపబోతే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండగా గమనించారు. తాని 2010 బ్యాచ్‌కు చెందిన వాడు. ఆయనకి తలిదండ్రులు, తమ్ముడు ఉన్నారు. నాలుగు నెలల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో తానీకి గాయాలయ్యాయి. అప్పటి నుంచి ప్రియురాలు అతన్ని దూరం పెట్టిందని, దీంతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా ప్రేమకు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. తానీ ఓ సెల్ఫీ వీడియోను తీసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment