వరంగల్: సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్న మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి చోరీ జరిగింది. వివరాలు...వరంగల్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కేస సముద్రం రైల్వేస్టేషన్‌లో రైలు ఆగింది. సికింద్రాబాద్ న్యూబోయిన్‌పల్లికి చెందిన తాళ్ల విజయలక్ష్మి ఈ రైలులో కుటుంబంతో కలిసి భద్రాచలం బయలుదేరింది. కిటికీ పక్కన కూర్చున్న విజయలక్ష్మి మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్లాడు. చేసేదేమీ లేక తిరిగి వరంగల్ చేరుకుని రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వరంగల్ జీఆర్‌పీ సీఐ రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.