
ఒంగోలులో చైన్‌స్నాచింగ్
ఒంగోలు క్రైం : నగరంలోని నిర్మల్‌నగర్‌లో ఆదివారం ఉదయం చైన్‌స్నాచింగ్ జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను అడ్డగించి బలవంతంగా ఆమె మెడలోని 10 సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు. నిర్మల్‌నగర్ 3వ లైనులో నివాసం ఉంటున్న ధనుంజయ రజనీకుమారి ఇంటి నుంచి సమీపంలో ఉన్న అపార్టుమెంట్ వద్దకు నడుచుకుంటూ వె ళ్తోంది. ఈలోగా ఇద్దరు యువకులు అత్యంత ఖరీదైన ద్విచక్ర వాహనంపై ఆమె వద్దకు వచ్చారు. ద్విచక్ర వాహనాన్ని ఒక యువకుడు పక్కన ఆపి ఇంజిన్‌ను రన్నింగ్‌లోనే ఉంచాడు.
మరో యువకుడు దగ్గరకు నడుచుకుంటూ వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును లాగే ప్రయత్నం చేశాడు. అప్పటికీ ఆమె అతనితో పెనుగులాడింది. అయినా లాభం లేకపోయింది. ఆమె మెడలోని 10 సవర్ల బంగారు గొలుసు తెంపుకెళ్లాడు. పక్కనే ఆపి ఉన్న ద్విచక్రవాహనంపై ఇద్దరూ వేగంగా వెళ్లిపోయారు. ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో చైన్‌స్నాచర్లు దర్జాగా పారిపోయారు.