
గుండె దిటవు చేసుకుని ఇది చూడండి!
ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో.. కొన్ని సందర్భాల్లో అంతే క్రూరంగా మారుతుందనడానికి ఈ వీడియో ఓ ఉదాహరణ. తనలో సగం ఉన్న బతికున్న పామును మింగేసిన మరో పాము దాన్ని మళ్లీ విడిచిపెట్టింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో షేర్ అవుతోంది.
ఈ వీడియోను చూస్తుందటే ఒళ్లు జలదరిస్తుంది. నలుపు రంగులో ఉన్న ఓ భారీ పాము, గోధుమ రంగున్న ఓ పామును మింగేసింది. ఏమైందో ఏమో మళ్లీ దాన్ని వాంతి చేసుకుంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గోధుమ రంగు పాము ఇంకా బతికే ఉంది.
ఈ వీడియోను షేర్ చేసిన క్రిస్టోఫర్ రెనాల్డ్స్ అనే వ్యక్తి తన కుటుంబంతో ఔటింగ్‌కు వెళ్లిన సమయంలో దీన్ని చిత్రించినట్లు పోస్టు చేశాడు. ఈ వీడియోను చూసిన తన కుటుంబం షాక్‌కు గురైనట్లు పేర్కొన్నాడు.