వినపడట్లేదు.. ఇంకా గట్టిగా: కోహ్లి | Watch Virat Kohli Ask Fans To Whistle Became Viral In 2nd Test | Sakshi
Sakshi News home page

వినపడట్లేదు.. ఇంకా గట్టిగా: కోహ్లి

Published Sun, Feb 14 2021 3:19 PM | Last Updated on Sun, Feb 14 2021 4:16 PM

Watch Virat Kohli Ask Fans To Whistle Became Viral In 2nd Test - Sakshi

చెన్నై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆనందం వచ్చినా.. బాధ కలిగినా అస్సలు తట్టుకోలేడు. ఎప్పటి ఆనందాన్ని అప్పుడే వ్యక్తం చేయాలనేది బహుశా కోహ్లి పాలసీ అనుకుంటా. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు వికెట్లతో చెలరేగుతుండడంతో కోహ్లి చాలా జోష్‌లో కనిపించాడు. రెండో రోజు ఆటలో కోహ్లి ఆద్యంతం అదే ధోరణిలో కనిపించాడు. ఒకవైపు ఆటగాళ్లను ఉత్తేజపరుస్తూనే.. మరోవైపు తన చేష్టలతో ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాడు.

కరోనా విరామం అనంతరం బీసీసీఐ మైదానంలోకి 50 శాతం  అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. లంచ్‌ విరామం అనంతరం ఇంగ్లండ్‌ మరో రెండు వికెట్లు కోల్పోయిన ఆనందంలో విరాట్‌ కోహ్లి అభిమానుల వైపు చూస్తూ విజిల్‌ వేసి ఉత్సాహపరిచాడు. అనంతరం వారిని చూస్తూ మీరు కూడా ఇదే విధంగా మీరు8 విజిల్‌ వేయండంటూ తెలిపాడు. ఫ్యాన్స్‌ వేస్తున్న విజిల్స్‌ను వింటున్నట్లుగా అటువైపు చెవులు పెట్టి..'వినబడట్లేదు.. ఇంకా గట్టిగా'అంటూ వారిని ఎంకరేజ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ఫాలోఆన్‌ గండం తప్పించుకోవాలంటే ఇంకా 10 పరుగులు చేయాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement