అసెంబ్లీలో బాలకృష్ణ ఓవరాక్షన్‌.. అంబటి స్ట్రాంగ్‌ కౌంటర్‌ | AP Assembly: Ambati Rambabu Serious Comments On TDP MLAs, Gave Counter To Balakrishna - Sakshi
Sakshi News home page

AP Assembly Session: అసెంబ్లీలో బాలకృష్ణ ఓవరాక్షన్‌.. అంబటి స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published Thu, Sep 21 2023 10:09 AM | Last Updated on Thu, Sep 21 2023 12:40 PM

Ambati Rambabu Serious Comments Over TDP MLAs In Assembly - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కాసేపటికే సభలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసిరారు. బాటిళ్లు విసురుతూ అనుచితంగా ప్రవర్తించారు. 

► ఈ నేపథ్యంలో వైఎ​స్సార్‌సీపీ ఎమ్మెల్యేలు స్పందించారు. ఈ సందర్బంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు సిద్ధమన్నారు. బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అసెంబ్లీలో ఏం అంశంపైనైనా చర్చుకు సిద్ధమన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు ఎంత సమయమైనా ఇస్తాం అని స్పష్టం చేశారు. 

► బుగ్గన చెప్పినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ నేతలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాసేపు ఓపికా పడితే చర్చకు సిద్దమని వెల్లడించారు. 

► దీంతో, మరింత రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. అంబటి వైపు చూస్తూ తొడగొట్టి.. మీసాలు మెలేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు కావాలనే రెచ్చగొడుతున్నారు. టీడీపీ సభ్యులు  అవాంఛనీయ ఘటనలను ఆహ్వనిస్తున్నారు. స్పీకర్‌పై దౌర్జన్యానికి దిగడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు బల్లలు కొడుతూ ఏం సందేశమిస్తున్నారు. అసెంబ్లీలో మీసాలు తిప్పితే చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇలాంటివన్నీ సినిమాల్లో చేసుకోవాలని కౌంటరిచ్చారు. అయితే, స్పీకర్‌ ఎంత వారించినా టీడీపీ సభ్యులు వినిపించుకోకపోవడంతో సభను కాసేపు వాయిదా వేశారు తమ్మినేని. 

► ఇదిలా ఉండగా.. శాససమండలి ప్రారంభమైన కాసేపటికే అటు మండలిలోనూ టీడీపీ సభ్యులు ఓవరాక్షన్‌ చేశారు. మండలిలో కూడా టీడీపీ సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేశారు. మండలి ఛైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. 

► ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. టీడీపీ సభ్యుల తీరు సరికాదు. ఏ అంశం పైన అయినా చర్చకు సిద్ధం. సభ సజావుగా జరిగేందుకు టీడీపీ సభ్యులు సహరికరించాలని కోరారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో టీడీపీ సభ్యుల తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement