Breadcrumb
పెగాసస్ స్పైవేర్ వ్యవహారం.. విచారణకు హౌస్ కమిటీ
Published Mon, Mar 21 2022 8:31 AM | Last Updated on Mon, Mar 21 2022 4:06 PM
Live Updates
తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. తిరిగి రేపు(మంగళవారం) ప్రారంభం కానున్నాయి.
పెగాసస్ స్పైవేర్ విచారణకు హౌస్ కమిటీ: అసెంబ్లీ స్పీకర్
పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం మాట్లాడుతూ.. పెగాసస్‌పై హౌస్‌కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. ఈ వ్యవహారంపై విచారణ హౌస్ కమిటీ విచారణ చేపడుతుందని తెలిపారు. దీనికీ సంబంధించి కమిటీ సభ్యులను రేపు(మంగళవారం), ఎల్లుండి ప్రకటిస్తామని తెలిపారు.
తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
పెగాసస్ స్పైవేర్‌తో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం: మంత్రి బుగ్గన
ఏపీ అసెంబ్లీలో పెగాసస్ స్పైవేర్‌పై చర్చలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. పెగాసస్ వంటి స్పైవేర్‌తో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని తెలిపారు. ఇది ప్రమాదమే కాదు.. అనైతికమని కూడా అన్నారు. చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్వేర్ కొన్నారని సీఎం మమతా చెప్పారని తెలిపారు. ఈ స్పైవేర్‌తో వ్యక్తిగత వివరాలన్నీ తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి అనైతిక కార్యక్రమాలు ఇల్లీగల్‌గానే చేస్తారని అన్నారు. చంద్రబాబు చేసిన చర్య.. మానవహక్కులకు భంగం కలిగించడమే అని పేర్కొన్నారు. పెగాసస్‌ను కొనడం.. ఘోరమైన నేరమని తెలిపారు. చంద్రబాబుకు అడ్డదారి రాజకీయాలు మాత్రమే తెలుసని అన్నారు. పెగాసస్‌ను చంద్రబాబు రాజకీయనేతలపై ఉపయోగించారని అన్నారు.2016లో పెగాసస్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు కొన్నారంటే ఎంత దుర్మార్గం అని తెలిపారు. పెగాసస్‌తో ఏం చేశారో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
సేవామిత్ర యాప్ ద్వారా కూడా టీడీపీ.. ఓటర్లపై నిఘా పెట్టిందని మంత్రి బుగ్గన తెలిపారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండేవారి ఓట్లను తొలగించారని అన్నారు. ఆధార్ డేటా సేకరించి ఏ ఓటర్ ఏ పార్టీకి ఓటు వేస్తారో తెలుసుకునే యత్నం జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఏబీ వెంకటేశ్వరరావు ఎన్నిసార్లు ఇజ్రాయెల్ వెళ్లారో తనకు తెలియదని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలతో పాటు, తన ఫోన్ ట్యాంపర్ అయిందని తెలిపారు. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారని చెప్పారు. ఇది రాజ్యాంగానికి విఘాతం కలిగించే చర్య అని సజ్జల అన్నారని గుర్తుచేశారు. పెగాసస్‌పై హౌస్‌కమిటీతో విచారణ జరపాలని మంత్రి బుగ్గన కోరారు.
ప్రజాస్వామ్య విలువలకు చంద్రబాబు తూట్లు: అబ్బయ్య చౌదరి
ఏపీ అసెంబ్లీలో పెగాసస్ స్పైవేర్‌పై చర్చలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలకు చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. పెగాసస్ వ్యవహారం దేశ సమగ్రతకు భంగం కలిగించే అంశం ఇది అని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుపై సీఎం మమత వ్యాఖ్యలు చేశారని తెలిపారు.
చంద్రబాబు అనైతిక రాజకీయవేత్త: గుడివాడ అమర్నాథ్
పెగాసస్‌పై ఏపీ అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మట్లాడుతూ.. వాస్తవాలు లేకుండా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ విషయంపై మాట్లాడరు కదా అని తెలిపారు. చంద్రబాబు హయాంలో పెగాసస్ సాఫ్ట్వేర్ ఉయోగించారని అన్నారు. బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా తెలిపారని గుర్తుచేశారు. చంద్రబాబు అనైతిక రాజకీయవేత్త అని అన్నారు. పెగాసస్ స్పైవేర్‌పై సమగ్రమైన విచారణ జరగాలని అన్నారు. తేలుకుట్టిన దొంగలా చంద్రబాబు ఉన్నారని అన్నారు. సీఎం మమతా ఆరోపణలపై టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడరు? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఒక్కసారైనా సొంతంగా అధికారంలోకి వచ్చారా? అని అన్నారు.
చంద్రబాబు ఎవరి కోసం పెగాసస్ కొన్నారో తేల్చాలి: అంబటి రాంబాబు
పెగాసస్‌పై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. పెగాసస్ వ్యవహారంపై ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు హయాంలో పెగాసస్ సాఫ్ట్వేర్ ఉపయోగించారని బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమత తెలిపారన్నారు. పెగాసస్ వ్యవహారంలో తమకు సంబంధం లేదని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారన్నారు. వాస్తవాలు లేకుండా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించరు కదా? అని అన్నారు. పెగాసస్ స్పైవేర్ అంశంపై విచారణ జరగాలని తెలిపారు. విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
చంద్రబాబుకు తెలిసింది కుట్రలు, కుతంత్రాలేనని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీని దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర చేశారని అన్నారు. చంద్రబాబు హయాంలోని ఓ ఇంటెలిజెన్స్ చీఫ్ పోలీసు అధికారిలా పని చేయలేదని పేర్కొన్నారు. పచ్చచొక్కా వేసుకున్న టీడీపీ నేతలా వ్యవహరించారని తెలిపారు. పెగాసస్‌ను ప్రత్యర్థి రాజకీయ నేతలపై ఉపయోగించారని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలందరీ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. సహచరులైన బీజేపీ నేతలపైనా కూడా పెగాసన్ ఉపయోగించారని తెలిపారు. చంద్రబాబు ఎవరికోసం పెగాసస్ కొన్నారో తేల్చాలని అన్నారు.
శాసన మండలి: దేవుడిని అవమానించే విధంగా టీడీపీ సభ్యుల తీరు
శాసన మండలిలో దేవుడిని అవమానించే విధంగా టీడీపీ సభ్యులు ప్రవర్తించారు. జంగారెడ్డిగూడెం మరణాలపై గోవిందా గోవింద అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అయ్యప్ప దీక్షలతో మద్యం అమ్మకాలు తగ్గిపోతాయని గతంలో చంద్రబాబు అన్నారు. ఇప్పుడు గోవిందా గోవింద అంటూ లోకేష్.. దేవుడిని అవమానిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. టీడీపీ సభ్యులకు కౌన్సిల్లో ఉండే హక్కులేదని మంత్రి వెల్లంపల్లి ధ్వజమెత్తారు.
ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా? టీడీపీకి మంత్రి అనిల్ సవాల్
ఏపీ శాసన మండలిలో టీడీపీకి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. పొత్తులు లేకుండా టీడీపీ ఎన్నికలకు వెళ్లగలదా? ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించగలరా అని మంత్రి ప్రశ్నించారు. 2024లో మేం ఒంటరిగా బరిలోకి దిగుతున్నామని.. ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా అంటూ మంత్రి అనిల్ సవాల్ విసిరారు.
మండలిలో ఎమ్మెల్సీ రుహుల్లాను అవమానించిన లోకేష్
ఏపీ శాసన మండలిలో మైనారిటీ ఎమ్మెల్సీ రుహుల్లాను నారా లోకేష్ అవమానించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ రుహుల్లా ప్రమాణాన్ని టీడీపీ అడ్డుకుంది. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకార ప్రసంగం వినపడకుండా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. మైనారిటీ ఎమ్మెల్సీని ప్రమాణం చేయనివ్వాలని వైఎస్సార్సీపీ కోరగా, అయితే ఏంటి.. మైనారిటీ ఎమ్మెల్సీ అని మాకు తెలుసులే అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. మైనారిటీ సభ్యుడిని అవమానించిన లోకేష్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్
ఏపీ శాసన మండలిలో టీడీపీ సభ్యులు ఓవరాక్షన్ చేస్తున్నారు. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. ఛైర్మన్ వారిస్తున్నా వారు పట్టించుకోలేదు. గందరగోళ పరిస్థితుల్లో సభను వాయిదా వేశారు.
హిందూ ఛారిటబుల్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి వెల్లంపల్లి
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. హిందూ ఛారిటబుల్ సవరణ బిల్లును సభలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రవేశపెట్టారు.
ఆర్టీసీ బలోపేతానికి ప్రత్యేక చర్యలు: పేర్ని నాని
ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రి పేర్ని నాని అన్నారు. 100 ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకొచ్చామని.. ఏప్రిల్ 30 నుంచి వినియోగంలోకి వస్తాయని మంత్రి తెలిపారు.
సభా గౌరవాన్ని దిగజార్చడమే టీడీపీ లక్ష్యం: కన్నబాబు
సభా గౌరవాన్ని దిగజార్చడమే లక్ష్యంగా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ప్రభుత్వంపై అపోహలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
మారని తీరు.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరు మారడం లేదు. స్పీకర్ చైర్‌ను, శాసన సభను అవమానించడమే తెలుగుదేశం సభ్యులు లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనబడుతోంది. మరోసారి స్పీకర్ పోడియం వద్ద వారు ఆందోళనకు దిగారు. విలువైన సభా సమయాన్ని వృథా కానీయొద్దని, సభా మర్యాదను కాపాడాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిసార్లు చెప్పినా వారు వినలేదు. దీంతో టీడీపీ సభ్యులను సభాపతి సభ నుంచి ఒక్కరోజు సస్పెండ్ చేశారు.
లైవ్ వీడియో
పెగాసస్‌పై చర్చ జరగాల్సిన అవసరం ఉంది: ఆదిమూలపు సురేష్
పెగాసస్ కొనాలని తమ వద్దకు వచ్చినట్లు నాటి ఐటీ మంత్రి లోకేషే చెప్పారని.. పెగాసస్‌పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణకు కమిటీ వేసిందన్నారు. దీన్ని ఎవరు కొన్నారు.. ఎలా వినియోగించారు అనేది తేలాల్సి ఉందని మంత్రి అన్నారు.
పెగాసస్‌పై చర్చకు నోటీసు ఇచ్చిన శ్రీకాంత్‌రెడ్డి
పెగాసస్‌పై చర్చకు వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. బెంగాల్ సీఎం వ్యాఖ్యలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రస్తావించారు. పెగాసస్‌పై చర్చకు చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి నోటీస్ ఇచ్చారు. స్వల్ప కాలిక చర్చ చేపడతామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.
పెగాసస్ అంశంపై చర్చ జరగాలి: మంత్రి బుగ్గన
ఏపీ అసెంబ్లీలో పెగాసస్ అంశంపై చర్చ జరుగుతోంది. పెగాసస్ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. పెగాసస్‌పై కమిటీ వేసి సుప్రీం దర్యాప్తు చేపట్టిందన్నారు. చంద్రబాబు హయాంలోనే పెగాసస్‌ను వాడారని బెంగాల్ సీఎం చెప్పారని మంత్రి అన్నారు. పెగాసస్ సాప్ట్వేర్ ద్వారా ఫోన్లు ట్యాపింగ్ చేసే అవకాశముందన్నారు. పెగాసస్‌పై చర్చించి కమిటీకి రిపోర్ట్ చేయాల్సి బాధ్యత ఉందని మంత్రి అన్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. పలు సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరపనున్నారు.
కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
సాక్షి, అమరావతి: కాసేపట్లో తొమ్మిదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు పలు సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. హిందూ ఛారిటబుల్ సవరణ బిల్లును మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఫారిన్ లిక్కర్ సవరణ బిల్లును మంత్రి నారాయణ స్వామి ప్రవేశపెట్టనున్నారు. స్కిల్ డెవలప్మెంట్, టూరిజం, మెడికల్ అండ్ హెల్త్.. విద్యాశాఖ సంబంధించిన బడ్జెట్ డిమాండ్ గ్రాంట్స్‌పై ఓటింగ్ చేపట్టనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment