Breadcrumb
AP Assembly Live Blog: పేదలను ఇంటి యజమానులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
Published Thu, Mar 17 2022 8:30 AM | Last Updated on Thu, Mar 17 2022 4:08 PM
Live Updates
ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా
ఏపీ అసెంబ్లీ గురువారం వాయిదా పడింది. తిరిగి అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
పేదలను ఇంటి యజమానులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
ప్రతి కాలనీలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. పేదల ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ అందజేస్తున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. గతంలో టిడ్కో ఇళ్లపై పేదలు నెలకు రూ.3వేలు కట్టాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ, ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషణ్ కూడా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే లక్షకుపైగా టిడ్కో ఇళ్లు పూర్తి చేశామని తెలిపారు. మరో 63వేల ఇళ్లు చివరి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. నిరుపేదలను ఇంటి యజమానులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పేదల కళ్లలో ఆనందం, సంతోషమే తమకు శక్తిని ఇస్తుందని అన్నారు. ప్రతి మహిల చేతికి రూ. 5 లక్షల వరకు ఆస్తిని ఇచ్చామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
పేదలకు 30.76 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం
పేదలకు 30.76 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం: సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంపై స్వల్ప కాలిక చర్చలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఎమ్మెల్యే గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు 30.76 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తొలి విడతలో 15.60 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సొంతిల్లు కట్టుకోవాలనేది ప్రతీ ఒక్కరి కల అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు మహాయజ్ఞం చేశారని తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం 71,811 ఎకరాల భూమి సేకరించామని తెలిపారు. రూ.25వేల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం సేకరించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 17 వేల కాలనీలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఇవాళ ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నామని చెప్పారు. 30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందజేశామని గుర్తు చేశారు.
పేదల పక్కా ఇళ్ల నిర్మాణంపై స్వల్పకాలిక చర్చ
ఏపీ అసెంబ్లీలో పేదల పక్కా ఇళ్ల నిర్మాణంపై స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది.
ఏపీ శాసన మండలి సోమవారానికి వాయిదా
ఏపీ శాసన మండలి గురువారం వాయిదా పడింది. తిరిగి శాసన మండలి సోమవారం ప్రారంభం కానుంది.
ప్రభుత్వంపై టీడీపీ తప్పుడు ప్రచారం: మంత్రి శంకర్‌నారాయణ
ప్రభుత్వంపై కావాలనే టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి శంకర్‌నారాయణ ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. అమరావతిలో పేరుతో గ్రాఫిక్స్ మాత్రమే చూపించారని.. చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదని శంకర్ నారాయణ మండిపడ్డారు. రోడ్లపై గత ప్రభుత్వం కంటే అధికంగా ఖర్చు పెడతున్నామన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ప్రగతి పథంలో ఏపీ: ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పని చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా సుపరిపాలన సాగిస్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఏపీని ప్రగతిపథంలో సీఎం జగన్ నడిపిస్తున్నారని ఆయన అన్నారు.
టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ రూలింగ్
టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం రూలింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో ఫోన్లో రికార్డింగ్‌లు చేయకూడదని తెలిపారు. సభ్యులు సభా సంప్రదాయాలను పాటించాలన్నారు
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
శాసన సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడంతో ఒక రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సత్యప్రసాద్, చినరాజప్ప, రామ్మోహన్, అశోక్, సాంబశివరావు, గొట్టిపాటి రవి, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణలను సస్పెన్షన్ చేశారు.
శాసనసభలో సభ్యుల మొబైళ్లకు అనుమతి లేదు: స్పీకర్
శాసన సభలో సభ్యుల మొబైళ్లకు అనుమతి లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. సభ్యులు సభా సంప్రదాయాలను పాటించాలన్నారు. సభా కార్యకలాపాలకు సహకరించి సభ్యులు హుందాగా మెలగాలని స్పీకర్ హితవు పలికారు.
గిరిజనుల కోసం 31 పథకాలు: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
గిరిజనుల కోసం 31 పథకాలను వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. అమ్మ ఒడి పథకం కింద 2,86,379 మందికి గిరిజన మహిళలకు 843,80 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 2019-20 నుంచి 2021-22 దాకా 84,478 మంది గిరిజన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ద్వారా 178. 67 కోట్ల రూపాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
తూ.గో జిల్లాలోని తీర ప్రాంతాల్లో రూ. 1650 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు:పెద్దిరెడ్డి
తూర్పుగోదావరి జిల్లాలోని తీర ప్రాంతాల్లో రూ. 1650 కోట్లతో తాగునీటి సరాఫరా ప్రాజెక్టును స్థిరమైన తాగునీటి వనరులో ఉప్పునీటి సాంద్రత సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పరిపాలన ఆమోదం తెలిపినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు కింద 32 మండలాల్లోని 29 లక్షల 23 వేల మందికి మంచినీరు త్రాగునీరు అందనుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు 2024 నాటికి పూర్తవుతుందన్నారు.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు: పెద్దిరెడ్డి
వైఎస్సార్సీపీ అధికారంలోకి తరువాత 1లక్షా 35 వేల మంది కార్యదర్శులు, 2 లక్షల 65 వేల మంది వాలంటీర్లలకు, మొత్తం 4 లక్షల మందిని ఏక కాలంలో ఉద్యోగాలు ఇచ్చిన ఘటన సీఎం వైఎస్ జగన్‌ది అని కొనియాడారు. రు.
సచివాలయాల్లో అన్ని రకాలు సేవలు: మంత్రి పెద్దిరెడ్డి
సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రిజిస్ట్రేషన్లు కూడా సచివాలయాల్లోనే జరుగుతున్నాయన్నారు. జగనన్న తోడు కింద ఇప్పటివరకు 3 విడతలు ఇచ్చామన్నారు. వైఎస్సార్ బీమా కింద ఇప్పటి వరకు రూ.129.90 కోట్లు ఇచ్చామన్నారు. కోవిడ్ సమయంలోనూ వాలంటీర్లు సేవలందించారన్నారు.
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల ఓవరాక్షన్
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలో ఓవరాక్షన్ చేస్తున్నారు. మళ్లీ స్పీకర్ పోడియం వైపు టీడీపీ సభ్యులు దూసుకెళ్లారు. స్పీకర్ వారిస్తున్నా టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారలేదు. టీడీపీ ఎమ్మెల్యేలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా టీడీపీ శవ రాజకీయాలు మానుకోవాలి: శ్రీకాంత్‌రెడ్డి
నాటుసారాను ప్రోత్సహించే అవసరం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సభను తప్పుదో పట్టించాలని టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. టీడీపీకి రోజూ ఏదోవిధంగా సభను అడ్డుకోవడం అలవాటుగా మారిందన్నారు. ఇప్పటికైనా టీడీపీ శవ రాజకీయాలు మానుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు.
లైవ్ వీడియో
సభలో గందరగోళం సృష్టించాలన్నదే టీడీపీ లక్ష్యం: అంబటి రాంబాబు
స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. సభా కర్యకలాపాలను పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ సభ్యుల తీరును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తప్పుబట్టారు. సభలో రోజూ గందరగోళం సృష్టించాలన్నదే టీడీపీ లక్ష్యం అంటూ మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభను సజావుగా సాగనివ్వరని.. చంద్రబాబు ఆదేశాల మేరకే వారు ఆందోళన చేస్తున్నారని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.
ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం: మంత్రి ఆదిమూలపు సురేష్
ప్రతిపక్షాలు సత్యదూరమైన ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పాఠశాల కూడా మూతపడదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా స్కూళ్ల విలీనం జరగలేదన్నారు.
సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న టీడీపీ సభ్యులు
సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారు. 8వ రోజూ కూడా టీడీపీ సభ్యుల తీరు మారలేదు. సభను అడ్డుకోవడం టీడీపీకి ప్రతిరోజూ అలవాటుగా మారిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాల్లో మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు పలు కీలక అంశాలపై మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అనంతరం పలు కార్పొరేషన్ల వార్షిక నివేదికలను ప్రభుత్వం.. సభ ముందు ఉంచనుంది.
కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
కాసేపట్లో ఎనిమిదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. ప్రశ్నోత్తరాల్లో మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు పలు కీలక అంశాలపై మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. అనంతరం పలు కార్పొరేషన్ల వార్షిక నివేదికలను ప్రభుత్వం.. సభ ముందు ఉంచనుంది.
Related News By Category
Related News By Tags
-
మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చాం: సీఎం జగన్
-
వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోం: సీఎం జగన్
-
మహిళలకు మంచి చేసే మనసు చంద్రబాబుకు లేదు: సీఎం జగన్
-
చంద్రబాబే ఎత్తు తగ్గుతున్నారు: సీఎం జగన్
CM Jagan Speech On Polavaram Project Works: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ కట్టారని, మధ్యలో మూడు పెద్ద ఖాళీలు వదిలి పెట్టారని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమా...
-
పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తీరుతాం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment