సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూపర్ పాలన అందిస్తున్నారంటూ రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శాసనసభలో శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు ఈ బడ్జెట్ నాది అనుకునేట్లుగా 2022–23 బడ్జెట్ ఉందన్నారు. రాష్ట్రంలో డైరెక్ట్ బెన్‌ఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా ఇప్పటివరకూ రూ.1.32 లక్షల కోట్లను ప్రజలకు నేరుగా ప్రభుత్వం అందించిందన్నారు.
ప్రస్తుత బడ్జెట్‌లో డీబీటీ పథకాల కోసం రూ.48,802 కోట్లు కేటాయించిందన్నారు. పేదలకు మేలుచేయాలని వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారనడానికి ఇది నిదర్శనమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలనలో విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లో వినూత్న మార్పులు వచ్చాయన్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావు మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా నేడు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నామన్నారు.
ఈ బడ్జెట్ నాది అనేలా ఉంది..
Published Sat, Mar 26 2022 4:16 AM | Last Updated on Sat, Mar 26 2022 7:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment