![Andhra Pradesh Former CM Konijeti Rosaiah Passed Away - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/4/Konijeti-Rosaiah--1.jpg.webp?itok=USsnSLFr)
AP Former CM Rosaiah Died In Hyderabad: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గమధ్యలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా పనిచేసిన రోశయ్య, తమిళనాడు గవర్నర్‌గానూ పనిచేశారు. గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన రోశయ్య, దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.
ఇదీ చదవండి: రోశయ్య మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
►అమీర్‌పేట్‌లోని నివాసానికి రోశయ్య భౌతికకాయం తరలించారు.
►సందర్శకుల కోసం రేపు ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం
►ఆదివారం మధ్యాహ్నం 12.30కి మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు
ప్రముఖుల సంతాపం:
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల ప్రముఖలులు సంతాపం తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళర్పించారు.
ఇదీ చదవండి: ఒక శకం ముగిసింది.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment