సమానత్వంతోనే సమసమాజం | rosaiah attend the conference in tirupathi | Sakshi
Sakshi News home page

సమానత్వంతోనే సమసమాజం

Published Mon, Dec 22 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM

సమానత్వంతోనే సమసమాజం

సమానత్వంతోనే సమసమాజం

తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య  
తిరుపతిలో ‘అంటరానితనానికి అంతిమయాత్ర’ సదస్సు

 
తిరుపతి: అంటరానితనం, అసమానతలు సమూలంగా రూపుమాపి, సమానత్వంతో ముందుకు సాగితేనే సమ సమాజ స్థాపన  సాధ్యమవుతుందని, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తెలిపారు. ట్రాన్స్‌ఫామ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఆదివారం అంటరానితనానికి అంతిమయాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు.

రోశయ్య గౌరవ అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. గతంలో అంటరానితనం అధికంగా ఉండేదన్నారు. ఎందరో మహనీయులు, సంఘసంస్కర్తలు ఎనలేని కృషి చేయడంతో కొంత తగ్గుముఖం పట్టిందన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జె. చలమేశ్వర్ మాట్లాడుతూ ఐక్యతే అభివృద్ధికి మార్గదర్శకమన్నారు. కలసి భోజనం చేయలేని వారు కలిసి యుద్ధం చేయలేరని నాడు భారతీయుల గురించి అలెగ్జాండర్ అన్న మాట లను ఆయన గుర్తు చేశారు.  

గౌరవ అతిథిగా హాజరైన  ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. చంద్రభాను మాట్లాడుతూ అంటరానితనం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలోకి వచ్చినప్పుడు దీన్ని నిర్మూలించవచ్చన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానంతో భారతదేశానికి పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో ఆయన చేర్చిన ఆిస్తి పదాన్ని అందరూ వ్యతిరేకించారని తెలిపారు.

ఫలితంగా నేడు కౌలు రైతు లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.  మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి, ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు పండిట్ భావన్ ఖలాల్ శర్మ,  కోట శంకర శర్మ, డాక్టర్ ప్రదీప్ జ్యోతి,  తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణన్, మాజీ ఎమ్మెల్సీ, ట్రాన్స్‌ఫామ్ ఇండి యా ఫౌండేషన్ అధ్యక్షుడు కె.జయచంద్ర నాయుడు అంటరానితనంపై ప్రత్యేకంగా రూపొందించిన సీడీని ప్రొజెక్టర్ ద్వారా ప్రెజెంట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement