Untouchability
-
Savitribai Phule: మహిళా విద్యకు తొలి వెలుతురు
‘సావిత్రిబాయి ఫూలే ప్రతిరోజూ సంచిలో అదనంగా చీర పెట్టుకుని స్కూల్‌కు వెళ్లేవారు. దారిలో ఎవరో ఒకరు ఆమె మీద పేడ విసిరితే కడుక్కుని కట్టుకోవడానికి’ అని రాస్తుంది రీతా రామస్వామి గుప్తా. నిమ్న వర్గాల ఆడపిల్లల విద్యకు జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి ఫూలేమీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కాని రచయిత్రి రీతా రామస్వామి మరిన్ని జీవిత చిత్రాలను సేకరించి తెచ్చిన పుస్తకం ‘సావిత్రిబాయి పూలే’ తాజాగా విడుదలైంది. రీతా రామస్వామి గురించి, పుస్తకంలో ఉన్న విశేషాల గురించి... ‘ఇవాళ బాలికల విద్య అనగానే ప్రపంచానికి మలాలా పేరు గుర్తుకొస్తుంది. కాని బాలికల విద్య కోసం జీవితాన్ని అర్పించిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే. మన దేశంలో ఆమె తొలి మహిళా ఉపాధ్యాయిని. ఆడపిల్లల చదువును ప్రచారం చేయడానికి ఆమె ఎదుర్కొన్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు’ అంటుంది రీతా రామస్వామి గుప్తా. గతంలో నటుడు సంజీవ్ కుమార్‌పై రాసిన బయోగ్రఫీతో పాఠకులకు తెలిసిన రీతా రామస్వామి ఆ తర్వాత ‘రంగ్ దే బసంతి’ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కలిసి అతని జీవిత సంగ్రహం రాసింది. ‘ఇలా ఇంకొన్ని పుస్తకాలు రాయాలనుకుంటుండగా నా 18 ఏళ్ల కుమార్తె– అమ్మా... ఎందుకు నువ్వు ఎప్పుడూ మగవాళ్ల గురించే రాస్తావు. నువ్వు రాయదగ్గ స్త్రీలు లేరా? అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న నన్ను ఆలోచింపచేసింది. దానికి జవాబే నా కొత్త పుస్తకం– సావిత్రిబాయి పూలే.. హర్ లైఫ్.. హర్ రిలేషన్షిప్స్.. హర్ లెగసీ’ అంది రీతా రామస్వామి. హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురణ సంస్థ నుంచి ఈ పుస్తకం తాజాగా విడుదలైంది. బలహీనులకు అందని విద్య ‘బ్రిటిష్ వారు 1813లో క్రైస్తవ మిషనరీల ద్వారా మన దేశంలో పాశ్చాత్య విద్యకు అంకురార్పణ చేశారు. అయితే వారి ఉద్దేశాలు వేరే. తమ వ్యవహారాల కోసం ఇంగ్లిష్ తెలిసిన కొంతమంది ఉద్యోగులు అవసరం కనుక పై వర్గాల వారికి చదువు నేర్పిస్తే వారి నుంచి కింది వర్గాల వారికి చదువు అందుతుంది అని భావించారు. కాని పై వర్గాలకు మొదలైన చదువు కింది వర్గాల వరకూ చేరలేదు. కింది వర్గాల వారికి పాఠశాలల్లో అనుమతి లేని పరిస్థితి. అంటరానితనం విస్తృతంగా ఉండేది. ఇక చదువుకు ఆడపిల్లలు నిషిద్ధం చేయబడ్డారు. ప్రభుత్వ టీచర్లకు ఇంగ్లిష్ వచ్చి ఉండాలన్న నియమం కూడా బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. వీటన్నింటినీ దాటి సావిత్రిబాయి పూలే టీచర్ అయ్యింది. జ్యోతిబా పూలేతో కలిసి 1848లో బ్రిటిష్‌వారితో సంబంధం లేని, మిషనరీలతో సంబంధం లేని బాలికల తొలి పాఠశాలను మొదలెట్టింది. దిగువ వర్గాల బాలికల విద్య కోసం పోరాడింది’ అంటుంది రీతా రామస్వామి. ఆ ఇద్దరు ‘సావిత్రిబాయి పూలే హర్ లైఫ్, హర్ రిలేషన్షిప్స్, హర్ లెగసీ’... పుస్తకంలో రీతా రామస్వామి కేవలం సావిత్రిబాయి పూలే గురించే రాయలేదు. ఆమెను ఆదర్శంగా తీసుకుని బాలికల విద్య కోసం తోడైన తొలి ముస్లిం ఉపాధ్యాయిని ఫాతిమా షేక్ గురించీ... సావిత్రి, ఫాతిమా కలిసి మహరాష్ట్రలో బాలికల విద్య కోసం స్కూళ్లు స్థాపించి నిర్వహించడానికి పడిన ఆరాటం గురించి కూడా రాసింది. ‘ఫాతిమ షేక్ తొలి క్వాలిఫైడ్ ముస్లిం ఉమెన్ టీచర్ మన దేశంలో. ఆమె సావిత్రిబాయి పూలేకి బాసటగా నిలిచింది. ఒక దశలో సావిత్రిబాయి సుదీర్ఘకాలం జబ్బు పడితే స్కూళ్ల నిర్వహణభారం మోసింది. ఆ వివరాలన్నీ నా పుస్తకంలో ఉన్నాయి’ అని తెలిపింది రీతా రామస్వామి. ఎన్నెన్నో అవమానాలు ‘దిగువ వర్గాల వారిలో ఆడపిల్లలకు చదువెందుకు అనే భావన విపరీతంగా ఉండేది. వాళ్లకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసేవారు. కాని వారి ఇళ్లకు వెళ్లి బడికి పంపమని కోరేది సావిత్రి. వారు శాపనార్థాలు పెట్టేవారు. దారిన పోతూ ఉంటే రాళ్లు విసిరేవారు. దానికి తోడు పేద వర్గాల వారిని చదివిస్తున్నందుకు అగ్రవర్ణాలు కక్ష కట్టి సావిత్రిబాయి మీద పేడనీళ్లు చల్లేవారు. అందుకని ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు తన సంచిలో చీర అదనంగా పెట్టుకునేది. ఎవరైనా పేడ నీళ్లు చల్లినా వెరవకుండా స్కూలుకు వెళ్లి చీర మార్చుకుని పాఠాలు చెప్పేది. ఆమె స్ఫూర్తి నేటికీ కొనసాగడం వల్ల మన దేశంలో బాలికల విద్య గణనీయంగా పెరిగింది. చదువులో ఉద్యోగాల్లో అమ్మాయిలు గొప్పగా రాణిస్తున్నారు. వారంతా తప్పక తెలుసుకోవాల్సిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే’ అంది రీతా రామస్వామి. -
మాటలు జాగ్రత్త.. విద్వేషాలను రెచ్చగొట్టకూడదు
చెన్నై: ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కే కానీ అది ద్వేషపూరితంగా ఉండకూడదని తెలిపింది. బాధ్యతలను తెలియజేసేది.. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు సనాతన ధర్మంపై వ్యతిరేకత గురించి డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఎలాంగోవన్ వేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ శేషసాయి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అనేది మన దేశం, మన పరిపాలకులు, తల్లిదండ్రులు, గురువుల పట్ల మన శాశ్వత బాధ్యతను గుర్తుచేసే ధర్మాల సమూహమని పేదల పట్ల దయ చూపించమని చెబుతుందని అన్నారు. సనాతన ధర్మంపై డిబేట్లా.. ఈ సందర్బంగా ఆయన సనాతన ధర్మంపై డిబేట్లు పెట్టడంపై మరింత తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మం కులవ్యవస్థను ప్రోత్సహించి అంటరానితనాన్ని ప్రేరేపిస్తుందన్న అసత్యాన్ని ప్రజల మనసుల్లో నాటే ప్రయత్నం చేయడాన్ని ఆయన ఖండించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని ఎప్పుడో నిర్మూలించడం జరిగిందని గుర్తుచేశారు. మనుషులంతా ఒక్కటే.. ఈ దేశంలో అందరూ ఒక్కటేనని ఇటువంటి దేశంలో అంటరానితనాన్ని సహించేది లేదని అన్నారు. మతం అనేది సహజమైన కల్మషంలేని స్వచమైన విశ్వాసం అనే పునాది మీద నిర్మితమైందని భావ ప్రకటన స్వేచ్ఛ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండకూడదని అన్నారు. ఇది కూడా చదవండి: ICMR: కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ -
Untouchability: మీకు సరుకులు అమ్మొద్దని చెప్పారన్నా!
క్రైమ్: అంటరానితనం.. శిక్షార్హమైన నేరం. టీవీ ప్రకటనలు, మైకుల్లో వినిపించడం వరకే పరిమితమైందా?. అక్కడక్కడా ఇలాంటి ఘటనపై ఫిర్యాదులు-చర్యలు ఉంటున్నా.. చాలా వరకు ఉదంతాలు వెలుగులోకి మాత్రం రావడం లేదు. తాజాగా తమిళనాడులో ఓ ఊరు ఊరు మొత్తం తక్కువ కులమంటూ కొందరి పట్ల అస్పృశ్యత కనబర్చడం వీడియో సాక్షిగా బయటపడింది. తమిళనాడు తంజావూరు జిల్లా పాపకాడు పరిధిలోని కేళామంగళం గ్రామంలో నవంబర్ 28వ తేదీన హిందూ కులాల ఆధ్వర్యంలో పంచాయితీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ఎస్సీ కులస్తులను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. ముందు చర్యలుగా వాళ్లకు ఎలాంటి ఉత్పత్తులు అమ్మకూడదని కిరాణ షాపు యాజమానులను ఆదేశించారు. అలాగే హోటల్లోకి రానివ్వొద్దని, క్షవరాలు చేయొద్దని ఆదేశాలు జారీచేశారు. ఇది దృష్టికి రావడంతో ఓ ఎస్సీ యువకుడు.. ఆ మరుసటి రోజే ఓ దుకాణానికి వెళ్లాడు. అయితే తాను సరుకులు అమ్మలేనని, ఇది ఊరంతా కలిసి తీసుకున్న నిర్ణయమని తెగేసి చెప్పాడు ఆ ఓనర్. ఇదంతా వీడియో తీసిన ఆ యువకుడు.. సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేశాడు. విల్లుపురం ఎంపీ రవికుమార్ దృష్టికి ఈ విషయం రావడంతో.. ఆయన సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసి చర్యలకు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలప్పుడు ఎస్సీఎస్టీ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన తమిళనాడు ప్రభుత్వానికి గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. వీఏవో దర్యాప్తు అనంతరం ఊరిలో షెడ్యూల్డ్ కులాల కమ్యూనిట్పై వివక్షత చూపిస్తున్న విషయం వాస్తవమేనని తేల్చారు. ఇక వీడియో ఆధారంగా షాప్ ఓనర్ వైరముత్తును అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని దుకాణానికి సీల్ వేశారు. అంతేకాదు.. ఊరిలో టీ దుకాణాల్లో రెండు గ్లాసుల విధానం అమలు అవుతోందని, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ల కోసం ఒక గ్లాస్, ఇతర కులాల కోసం మరో గ్లాస్ విధానం అమలు అవుతోందని గుర్తించారు. అలాగే బార్బర్ దుకాణాల్లోనూ కొన్నిసార్లు వాళ్లకు క్షవరం, కటింగ్‌లు చేసేందుకు కూడా నిర్వాహకులు అంగీకరించడం లేదని గుర్తించారు. ఈ నేపథ్యంలో.. గ్రామంలో గొడవలు జరిగే అవకాశం ఉండడంతో.. పోలీసులను మోహరించారు అక్కడ. అఫ్కోర్స్.. ఇలాంటి ఊర్లు తమిళనాడులోనే కాదు.. అంతటా ఉన్నాయనుకోండి!. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్‌లో తమిళనాడు తెన్‌కాశీ పంజాన్కుళంకు చెందిన ఓ దుకాణ యజమాని.. దళిత కులానికి చెందిన పిల్లలకు చాక్లెట్లు అమ్మలేదు. తాను గ్రామ పంచాయితీ ఆదేశాలను పాటిస్తున్నానని చూపించేందుకు అతగాడు అదంతా వీడియో తీశాడు. అయితే ఆ వీడియో బయటకు రావడంతో.. శంకరన్‌కోయిల్ పోలీసులు మహేశ్వరన్ అనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. -
బహుజన బతుకమ్మ ఆడదాం
మన సమాజపు ఆవరణలోని పునాది ఉపరితలాల్లో పరివ్యాప్తి చెంది, సమాజపు లోతుల్లోకి పాతుకుపోయిన కులవివక్ష, లింగ వివక్ష గురించి మాట్లాడుకోవడానికి మున్నూట ఆరవై ఐదు రోజులు సరిపోవు. అలాంటి వివక్షకు గురవుతున్న బహుజన సమాజపు స్త్రీలు అచ్చంగా ఆడి పాడేదే బతుకమ్మ పండుగ. చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ, తదనంతర విప్లవోద్యమంలోనూ, అలాగే స్వరాష్ట్ర సాధన పోరాటంలోనూ బతుకమ్మ ఒక ఉద్యమ పతాకగా మన చేతికందింది. నిషేధాలకు గురై కూడా కొనసాగుతున్న అంటరానితనం, అన్ని రంగాల్లో ప్రబలిన కులవివక్ష, పితృస్వామ్యం, బతుకమ్మ పండుగల్లోనూ వ్యక్తమవుతుంది. ప్రజలంతా జరుపుకునే పండుగల్లోనూ ఊరూ–వాడల్ని విభజించే కుల వివక్షకు వ్యతిరేకంగా ‘కల్సి ఆడుదాం– కల్సి పాడుదాం–కల్సి పోరాడుదాం’ అంటూ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బహుజన బతుకమ్మ ద్వారా పండుగల్లోని అసమానతలను, వివక్షను సరిచేస్తూ దీన్నొక పంటల పండుగగా జరుపుతున్నాం. అందుకే ‘బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమం’ అంటూ చాటుతున్నాం. బతుకమ్మ బహుజన సాంప్రదాయం. పురాణ ఇతి హాసాల్లో బతుకమ్మ గురించి ఏమి చెప్పినా బతుకమ్మ మాత్రం తెలంగాణ పంటల పండుగ. మత కోణం నుండి దీనిని బ్రాహ్మణీకరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దూరంగా నిశ్చేష్ఠులై ఉండలేము కదా! తెలంగాణ ఉత్పత్తి విధానంలోని నవధాన్యాల సంస్కృతిని ఎత్తిపడ్తూ దానితో ముడిపడ్డ పంటలనూ, ఆ పంటలకు నీరిచ్చే చెరువులూ, కుంటలనూ; వాటికి ఆదరువైన గుట్టలూ, కొండలనూ కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. అలా ప్రతి ఏటా వర్తమాన సమస్యలతో జోడించి బహుజన బతుకమ్మను కొనసాగిస్తున్నాం. నా అనుభవంలో ఏ కులానికి ఆ కులం కలిసి ఆడు కోవడం, బతుకమ్మను నీళ్లల్లో వేసి సాగనంపి మాలో మేమే సద్దులు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం. నా చిన్నతనంలో కుల వాడలు, వెలివాడలు స్పష్టంగా ఉన్న కాలంలో కుర్మోళ్ల బతుకమ్మ, రెడ్డోళ్ల బతుకమ్మ అంటూ పోటీపడేవాళ్ళం. నిన్న మొన్నటిదాకా కూడా దళితుల బతుకమ్మ ఊర్లోళ్ళ బతుకమ్మతో కలిపి ఆడుకోవడం అనేది లేకుండా పోయిన విషయం మన గమనంలో ఉంది. గడిచిన 12 ఏళ్ల అనుభవంలో దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేస్తూ ఊరుతోపాటు ఆడి పాడి వారితో కలిసి ఒకే చెరువులో నిమజ్జనం చేయడమే ఒక విప్లవాత్మక చర్యగా ప్రజలు భావించారు. ఇక గర్భగుడిలోకి దళితుల ప్రవేశం గురించి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందేమో! ఇంకా కొన్ని గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి అమలు జరుగుతోంది. ఇప్పటికీ భూమిలేని దళితులు కోకొల్లలు. వారికి కనీస భూమి ఇవ్వాలి. వారు ఊరుతో కలిసి ఆడుకొని, సహపంక్తి భోజనాలు చేసుకుని ఆత్మ గౌరవంగా పండుగ చేసుకునేలా ప్రజలు ఐక్యతను చాటాలి. - విమలక్క ప్రజా గాయని -
అమ్మవారి పల్లకి ముట్టుకున్నందుకు..60 వేలు జరిమాన
మాలూరు: గ్రామాల్లో ఇప్పటికీ అస్పృశ్యత అనే రక్కసి వెంటాడుతోంది. ఇందుకు నిదర్శనమే ఈ ఉదంతం. దళిత బాలుడు అమ్మవారి పల్లకీని ముట్టుకున్నాడని గ్రామస్తులు అతని కుటుంబానికి రూ.60 వేల జరిమానా విధించారు. డబ్బు కట్టకపోతే అక్టోబర్ 1 లోగా గ్రామం విడిచి వెళ్లాలని హుకుం జారీచేశారు. ఈ అమానవీయ సంఘటన కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని ఉళ్లేరహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఉళ్లేరహళ్లి గ్రామంలో 10వ తరగతి చదువుతున్న దళిత బాలుడు చేతన్ ఈ నెల 8వ తేదీన బూత్యమ్మ జాతరలో అమ్మవారి పల్లకీని తాకాడు. ఇది చూసి అగ్రవర్ణాల వారు బాలున్ని మందలించి కొట్టారు. అంతటితో ఆగకుండా పంచాయతీ పెట్టారు. బాలుడు ముట్టుకోవడం వల్ల మైలపడిందని, ఇందుకు శాంతి కార్యక్రమం చేయడానికి రూ.60 వేలు కట్టాలని బాలుని తల్లి శోభను ఆదేశించారు. పోలీసులకు తల్లి ఫిర్యాదు దీంతో భయపడిన శోభ సోమవారం మాస్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేట్టారు. పలు దళిత సంఘాలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు నారాయణస్వామి, రమే‹Ù, వెంకటేశప్ప, నారాయణస్వామి, కొట్టప్ప, అర్చకుడు మోహన్రావ్, చిన్నయ్యలతో పాటు మరికొందరిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. (చదవండి: విధి వంచితురాలు) -
మేము ఈ దేశ పౌరులమేనా?
స్వాతంత్య్ర పోరాటాన్ని విజయవంతంగా నడిపిన గాంధీని ఆఫ్రికాలో తెల్లవాళ్ళు ఎక్కిన రైలు బోగీ నుంచి కిందికి తోసేసిన ఘటన చదివినప్పుడల్లా భారతీయులం రగిలిపోతుంటాం. బ్రిటిష్ వారి జాత్యహంకారానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసి, స్వాతంత్య్రం సాధించుకున్నాం. అయితే మన దేశంలో ఉన్న కుల సమాజపు అసమానతలు, దానితో వచ్చిన విద్వేష, కులదురహంకార దాడుల మాటేమిటి? నిజంగా ఈ స్వతంత్ర భారతావని దళితులను ఇంకా తమవాళ్ళుగా భావిస్తోందా? దళిత సోదరులపై ఏటేటా పెరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు దేన్ని సూచిస్తున్నాయి? నేనీ దేశ పౌరుడినేనా? ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఓ దళితుడిగా నేనెక్కడున్నాను? ► ఏ దేశానికైనా పరాయి పాలన నుంచి విముక్తి లభిస్తే పండుగే! దేశ ప్రజలమైన మనం ఆజాదీ అమృతోత్సవాలు చేసుకోవడం అంతులేని ఆనందాన్నే ఇస్తుంది. అయితే కొద్ది రోజులుగా నా మనసును ఓ ప్రశ్న వేధిస్తూ ఉంది. ఈ స్వర్ణోత్సవాల్లో భాగస్వామిని కాగలనా? లేదా? అసలు నేనీ దేశ పౌరుడినేనా? అయితే ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో దళితుడిగా నేనెక్కడున్నాను? దేశంలో స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుభవించిన వేదన ఏదో కట్టిపడేస్తోంది. ఈ సంబరాలకూ, నీకూ ఏ సంబంధం లేదంటోంది. ► మన దేశం ఇప్పటికే రెండు పండుగలు జరుపుకొంది. ఇప్పుడు మూడో పండుగ ‘ఆజాదీ కా అమృతోత్సవ్’. సంవత్సరకాలంగా ఈ ఉత్సవాలు సాగుతున్నాయి. 1972లో వెండిపండగ, 1997లో బంగారు పండుగ, ఇప్పుడు ఏకంగా అమృతోత్సవాల్లో మునిగితేలుతున్నాం. 1972కు ముందు అంటే 25 ఏళ్ళల్లో ఎంతో మార్పు వస్తుందని అంతా భావించారు. విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయ ప్రాతినిధ్యంలో, ఆర్థిక రంగంలో కొంత మెరుగైన ఫలాలు వచ్చినమాట నిజమే. అది ఈ దేశప్రజల చైతన్య పునాదులపై ఆధారపడి జరిగిందే తప్ప, అప్పణంగా ఎవరూ అప్పజెప్పింది కాదు. అయితే ఎంత ప్రగతి సా«ధించినా సాటి మనిషి నన్ను జంతువుల కన్నా హీనంగా చూస్తోంటే, నోరెత్తి న్యాయం అడిగితే అరెస్టులు, దాడులు. రాజ్యాంగ బద్ధ సమాన హక్కుల కోసం అడిగితే, ప్రాణాలే గాలిలో కలిసిపోతున్నాయి. నా జీవితంలోని సంఘటన పాతికేళ్ళ స్వాతంత్య్రం వట్టి బూటకమని ఎలా తేల్చిందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ► నేటి పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం జనగామ గ్రామం నా సొంత ఊరు. మా నాన్నకు ముగ్గురు తమ్ముళ్ళు. అందులో చిన్నవాడి పేరు మల్లెపల్లి రాజం. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు ఇప్పటి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రాంతానికి గని కార్మికుడిగా పనిచేయడానికి వెళ్ళాడు. 1960లో మా గ్రామం శివారులోనే బొగ్గు గనులు ప్రారంభం కావడంతో ఇక్కడ పనిచేయడానికి తిరిగి వచ్చాడు. అటు బొగ్గు గనుల్లో పనిచేస్తూ, గ్రామంలో కూలీల, పాలేర్ల జీతాల పెరుగుదల కోసం పనిచేశాడు. అదేవిధంగా భూస్వాముల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను ప్రజలకు పంచడానికి ఉద్యమాలు నడిపాడు. అది భూస్వాములకు కడుపుమండేలా చేసింది. 1963లో జరిగిన సంఘటన ఆయనను మా నుంచి శాశ్వతంగా దూరం చేసింది. ► మా ఊరి మధ్యలో ఒక మర్రిచెట్టు ఉండేది. దానిచుట్టూ బండలతో ఒక గద్దె కట్టి ఉండేది. దాన్ని కచ్చేరీ గద్దె అనేవాళ్ళం. దాని మీద అగ్రవర్ణ దొరలు మాత్రమే కూర్చునేవారు. మా చిన్నాన్న మల్లెపల్లి రాజం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త. అందువల్ల ఆ చైతన్యం ఇచ్చిన ధైర్యంతో దొరలు కూర్చునే కచ్చేరీ గద్దె దగ్గరకు వెళ్ళి, ‘కచ్చేరీ గద్దె మీద మేం కూడా కూర్చుంటాం’ అని అడిగాడు. అక్కడ ఘర్షణ జరిగింది. రెండు రోజుల తర్వాత మా చిన్నాయన కనిపించకుండా పోయాడు. మూడు రోజుల వరకు ఆచూకీ తెలియలేదు. నిజానికి మా చిన్నాయనను కిడ్నాప్ చేసి, మూడు రోజులు పొగాకు బ్యారెన్‌లో బంధించి, చిత్రహింసలకు గురిచేశారు. కసితీరా చంపి ఊరి చివర కుంటలో పడేశారు. కుటుంబ సభ్యులు వెతగ్గా, వెతగ్గా, మూడు రోజుల తర్వాత శవమై తేలాడు. ‘కచ్చేరీ గద్దెపై మేం కూడా కూర్చుంటాం’ అన్నందుకు స్వతంత్ర భారతావనిలో ఓ దళితుడికి జరిగిన శాస్తి అది. ఇది అప్పట్లో పెద్ద సంచలనం. వేలాది కార్మికులు నిరసనగా పెద్ద ఊరేగింపు చేశారు. అయినా సరే నిందితులపై కేసు కూడా నమోదు కాలేదు. ఇదీ ఈ దేశ స్వాతంత్య్రం ఓ దళితుడికి అందించిన స్వేచ్ఛ. ► అంతటితో ఆగలేదు. 1968లో 25 డిసెంబర్న కీలవేన్మణిలోని 44 మంది దళితులను అక్కడి ఆధిపత్య కులాలైన భూస్వాములు సజీవ దహనం చేశారు. దీంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్లా కంచికచర్లలో కోటేశ్ అనే దళిత యువకుడిని గుంజకు కట్టి, కిరోసిన్ పోసి, కాల్చారు. ఇది కలవరపాటుకు గురిచేసింది. ఇంకా ఎన్నో జరిగాయి కానీ అంతగా బయటకు రాలేదు. అయినా భవిష్యత్తులోనైనా అంతరాలు తొలగిపోతాయన్న ఆశతో దళితులు ముందుకు నడిచారు. 1972లో స్వాతంత్య్ర రజతోత్సవాల్లో భాగస్వాములయ్యారు. ► ఇట్లా వెండిపండుగ జరుపుకొన్నామో లేదో, బీహార్‌లోని బెల్చిలో 1977 మే 27న ఎనిమిది మంది దళితులను చేతులు కట్టేసి కాల్చి చంపి, ఒక చితి మీద తగులబెట్టారు. ఇదంతా ఒక ఆధిపత్యకుల భూస్వాములు చేసిన నీతిమాలిన చర్య. 1985లో కారంచేడులో, 1991లో చుండూరులో దళితులను ఊచకోత కోసిన ఘటనలు ఇంకా కళ్ళ ముందు రక్తమోడుతున్నాయి. గుండెగాయాల్ని కెలుకుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ మన స్వతంత్ర భారతావని మరో మైలురాయిను దాటి స్వర్ణోత్సవం జరుపుకొంది 1997లో. అదే ఏడాది బీహార్‌లోని లక్ష్మణ్‌పూర్ బాతేలో 58 మంది దళితులు ఊచకోతకు గురయ్యారు. అయినా దళితులు రాజ్యాంగంపై అంతులేని విశ్వాసంతో ఆ ఉత్సవాల్లోనూ భాగస్వాములయ్యారు. ప్రతి ఏటా జెండా పండుగను ఈ దేశ దళితులు చేసుకుంటూనే ఉన్నారు. 2006లో మహారాష్ట్రలోని ఖైర్లాంజి ఘటన సహా చెప్పుకుంటూ పోతే... కొన్ని వేల ఘటనలు స్వాతంత్య్ర సంబరాలతో దగాపడ్డ దళితన్నల గుండెలు చీల్చుకొస్తాయి. ► సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సేకరించిన లెక్కల ప్రకారం 1994 నుంచి 2020 మధ్య 26 ఏళ్ళలో 17,835 మంది దళితులు హత్యకు గురయ్యారు. 44,506 మంది దళిత మహిళలు ఆధిపత్య కులాల చేతుల్లో అత్యాచారాలకు బలయ్యారు. అంతేకాక 85,219 మంది దళితులపైన తీవ్ర భౌతిక దాడులు జరిగాయి. ఇందులో ఎక్కువ మంది అంగవికలురు అయ్యారు. మనదేశం స్వాతంత్య్రం కోసం పోరాడడానికి బ్రిటì ష్ వాడు వాళ్ళతో మనల్ని సమానంగా చూడక అవమానాలకు గురిచేయడమే కారణమంటాం. మరి, మన దేశంలో ఉన్న కుల సమాజ అసమానతలు, దానితో వచ్చిన విద్వేష, కులదురహంకార దాడుల మాటేమిటి? వీటినెవరు ప్రశ్నిస్తారు? నిజంగా ఈ స్వతంత్ర భారతావని దళితులను ఇంకా తమవాళ్ళుగా భావిస్తోందా? నా దళిత సోదరులపై ఏటేటా దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతోన్నస్థితి దేన్ని సూచిస్తోంది? నేనీ దేశ పౌరుడినేనా? అందుకే అమృతోత్సవాన్ని తలచుకున్న ప్రతిసారీ ఈ అనుమానం వెంటాడుతూనే ఉంది. ► అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2004లో 546 మంది దళితులు హత్యకు గురైతే, 2014లో 704 మంది, 2020లో 902 మంది అగ్రకుల దాడుల్లో మరణించారు. 16 ఏళ్ళలో దళితులపై అఘాయిత్యాలు రెండింతలు పెరిగాయి. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడి ఉంటే, ఈ దాడులు తగ్గాలి. కానీ ఏటేటా పెరుగుతూనే ఉన్నాయంటే అర్థం ఏమిటి? ఈ స్వాతంత్య్రానికి అర్థం ఏమిటి? 2004లో 1157 మంది అత్యాచారాలకు బలైతే, 2020లో ఆ సంఖ్య 3396కి చేరింది. అంటే దళిత స్త్రీలపై అత్యాచారాలు మూడు రెట్లు పెరిగాయి. దేశంలోని ప్రజాస్వామ్య వాదులు చాలా విషయాల్లో తమ ఆందోళన ప్రకటిస్తుంటారు. దళితుల విషయానికి వస్తే నిజంగా ఉండాల్సినంత స్పందన లేదన్నది నిర్వివాదాంశం. ప్రభుత్వాలూ అంతే. ఇలాంటి అమానవీయ పరిస్థితుల్లో మా ఇంటిపైన ఏ జెండా ఎగురవేయాలి? ఫోన్లో డీపీని మార్చుకోమంటారా? ఆ పని ఎలా చేయగలను? ఇప్పుడు ఈ విషయం రాయడంతో అద్భుతాలు జరగకపోవచ్చు. కానీ దేశంలోని ఇతర కులమతాల పెద్దలు, విద్యావేత్తలు, న్యాయాధీశులు, రాజకీయ వేత్తలు ఆలోచిస్తారని ఆశ. రాబోయే తరాలు ఈ స్వాతంత్య్ర సంబరాల్లో తమ పాత్రను ఎంచుకుంటారనే భావన. అంతే! వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
షేక్‌హ్యాండ్ ఎందుకివ్వరు.. పరిస్థితి మారాలి
న్యూఢిల్లీ: పారిశుద్ధ్య కార్మికులకు పనివేళల్లో మాస్క్‌లు, ఇతర భద్రతా పరికరాలు, దుస్తులు అందించడంలో విఫలమవుతున్న కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. విష వాయువులు పీల్చి చనిపోవాల్సిందిగా ఏ దేశమూ తన పౌరులను పంపదని విమర్శించింది. పారిశుద్ధ్య కార్మికులకు తగిన రక్షణ ఏర్పాట్లు ఎందుకు కల్పించడంలేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోర్టు ప్రశ్నించింది. ‘మ్యాన్‌హోల్స్‌లో దిగే కార్మికులకు ఆక్సిజన్ సిలిండర్లు ఎందుకు ఇవ్వట్లేరు? మురికికాలువలు, మలమూత్రాలను ఎత్తే కార్మికులకు మాస్క్‌లు, ఇతర కనీస పరికరాలను ఎందుకు ఇవ్వట్లేరు? ఏ దేశమూ ఇలా తమ పౌరులను విషవాయువులతో నిండిన (గ్యాస్ ఛాంబర్లలో) మ్యాన్‌హోల్స్‌లో చనిపోవాలని తమ పౌరులను పంపించదు’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చిందని పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సదుపాయాలను పాలకులు కల్పించడం లేదని జస్టిస్ అరున్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఎంఆర్ సాహా, బీఆర్ గవాయ్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. పారిశుద్ధ్య కార్మికుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్రం వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం బెంచ్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పారిశుద్ధ్య కార్మికులు చేసే పనిని నివారించే చట్టాలేవి లేవని కోర్టుకు అటార్ని జనరల్ తెలపగా.. ‘మనుషుల్ని ఈవిధంగా చూడటం అమానవీయం’ అంటూ బెంచ్ మండిపడింది. దేశంలో అంటరానితనం కొనసాగుతుండడం పట్ల కూడా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘దేశంలో అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించింది. పారిశుద్ధ్య కార్మికులకు మీరు షేక్‌హ్యాండ్ ఇస్తారా నేను అడిగితే.. ఇవ్వను అనే సమాధానం వస్తుంది. అలాంటి మార్గంలో మనం పయనిస్తున్నాం. ఈ పరిస్థితులు మారాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా అంటరానితనం లాంటి దురాచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయ’ని జస్టిస్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. -
గుజరాత్లో అంటరానితనం
అహ్మదాబాద్: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినా అంతరానితనం కొనసాగుతూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో దళిత ఉపాధ్యాయుడి పట్ల వివక్ష చూపిన అమానవీయ ఘటన తాజాగా వెలుగు చూసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటకు వచ్చింది. సురేంద్ర నగర్ జిల్లాలోని పియావా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దళితుడైన తన పట్ల ప్రధానోపాధ్యాయుడు మాన్‌సంగ్ రాథోడ్ ప్రతిరోజు వివక్ష చూపించారని బాధితుడు కన్హయలాల్ బరైయా(46) ఆరోపించారు. తనను అంటరానివాడిలా చూసేవారని వాపోయారు. ‘పాఠశాలలో రెండు వేర్వేరు కుండల్లో మంచినీళ్లు పెట్టించారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేను ఒక కుండలో నీళ్లు మాత్రమే తాగాలి. అగ్రకులాల వారైన మరో ముగ్గురు ఉపాధ్యాయులు మరో కుండలో నీళ్లు ఉంచారు. అగ్ర కులాల వారి కుండలో నీళ్లు తాగినందుకు జూలైలో 3న నాకు నోటీసులు ఇచ్చారు. విద్యార్థులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు వేధింపులు భరించాన’ని కన్హయలాల్ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయనకు సాయుధ పోలీసుతో రక్షణ ఏర్పాటు చేశారు. గుజరాత్లో అంటరానితనం కొనసాగుతోందనడానికి కన్హయలాల్ ఉదంతమే నిదర్శనమని వాద్గామ్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని అన్నారు. అంతరానితనాన్ని రూపుమాపడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. -
స్త్రీలు పిల్లల్ని కనే యంత్రాలేనా?
ప్రపంచం ఆర్థికవృద్ధి రేటు లెక్కల్లో తలమునకలవు తోంది. వృద్ధి కొలబద్దలతోనే అభివృద్ధిని లెక్కి స్తోంది. స్త్రీల భాగస్వామంతో స్థూల జాతీయోత్పత్తి పెంచుకోవడంపై రకరకాల విశ్లేషణలు జరుపుతోంది. పలు సంస్థలు ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెంచడంలో, అభివృద్ధి చర్చలో స్త్రీల పాత్ర ఎంత కీలకమో లెక్కలేసి చెబుతున్నాయి. ఇంకోవైపు– స్త్రీలను ఇంటికే పరిమితం చేసే, ఆమె చోటును కుదించే కుట్రలూ అంతే స్థాయిలో జరుగుతున్నాయి. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ అయిన జపాన్ రాజధాని టోక్యోలో అలాంటి ఓ పెద్ద కుట్ర జరిగిందిప్పుడు. పథకం ప్రకారం వేలాది మంది మహిళల్ని వైద్యవిద్యకు నిరాకరించిన ఆ కుట్ర రాజకీయంపై అంతర్జాతీయ మీడియాలో చర్చ జరుగు తోంది. పెళ్లి తర్వాత లేదా బిడ్డలు పుట్టాక చాలామంది స్త్రీలు ఉద్యోగాలు మానేస్తుంటారు కాబట్టి, వైద్యవిద్య కోర్సుల్లో చేరకుండా వారిని సాధ్యమైనంత మేరకు కుదిస్తోంది టోక్యో మెడికల్ యూనివర్సిటీ. ప్రవేశ పరీక్షల్లో వారిని తప్పిస్తోంది. అమ్మాయిల ప్రవేశా లకు 30 శాతం మేర గండికొడుతోంది. అర్హతతో నిమిత్తం లేకుండా అబ్బాయిల సంఖ్యను పని గట్టు కుని మరీ పెంచుతోంది. లంచం తీసుకుని కొందరికి 49 పాయింట్ల్ల వరకూ కలిపింది. మూడుసార్లు తప్పిన విద్యా మంత్రిత్వ శాఖాధికారి కొడుక్కి ప్రవేశం కల్పించినట్టు వచ్చిన ఆరోపణలపై వర్సిటీ జరిపించిన దర్యాప్తులో ఈ కుంభకోణం బట్టబయ లైంది. 2006 లేదా అంతకంటే ముందు నుంచీ ఈ కుట్ర రాజకీయం కొనసాగుతున్నట్టు తేలింది. మొదట అక్రమాలేవీ జరగలేదని బుకాయించిన అధి కారులు.. తర్వాత జనాగ్రహానికి తలొగ్గారు. స్కూలు మేనేజింగ్ డైరెక్టర్ టెట్సో యుకియోకా విలేకరుల సమావేశం పెట్టి క్షమాపణ కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని మొత్తం 81 మెడికల్ స్కూళ్ల ప్రవేశ తీరుతెన్నులపై విద్యాశాఖ విచారణ చేప ట్టింది. గత ఆరేళ్ల దరఖాస్తుల తాలూకూ డేటా రాబట్టే పనిలో పడింది. ప్రవేశాల్లో స్త్రీ పురుష నిష్పత్తి కోణం నుంచీ పరిశీలన జరుపుతామంటున్నారు విద్యాశాఖ అధికారులు. జపాన్‌లో ఇలాంటి విచా రణ దేశవ్యాప్తంగా జరగడం ఇదే మొదటిసారి. జపనీయ సమాజంలో పాతుకుపోయిన తీవ్ర వివక్షకు టోక్యో వర్సిటీ కుంభకోణం ఒక పెద్ద ఉదాహరణ. లింగ సమానత్వ మంత్రిత్వ శాఖ, సమాన ఉద్యోగావకాశాల చట్టం అక్కడ అలంకార ప్రాయమే. జాతీయ వైద్య పరీక్షల్లో నెగ్గుతున్న మహిళలు గత ఇరవై ఏళ్లలో 30 శాతం మించక పోవడం వెనుక, మహిళా వైద్యులు నమ్మదగినవారు కాదనే భావన వ్యాపించడం వెనుక ఉన్నది కచ్చి తంగా వ్యవస్థాగత కుట్రే. స్త్రీలకు పనులివ్వడంలో, వారి నైపుణ్యాలను గుర్తించడంలో తీవ్ర వివక్ష కనబరుస్తున్న కంపెనీలను కట్టడి చేయగల వాతావరణమూ లేదక్కడ. ఓవైపు– స్త్రీల జీవితాలను వెలిగించగల దేశంగా, వ్యవస్థలో వారి భాగస్వామ్యం పెంచే దిశగా జపాన్ను తీర్చి దిద్దుతామంటున్నారు ప్రధాని షింజో అబే. మరో వైపు – స్త్రీ పురుషుల మధ్య అంతరాలు మరింతగా పెరుగుతున్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రూపొందించిన జండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం– పదేళ్ల కిందట 144 దేశాల్లో 80వ స్థానంలో ఉన్న జపాన్.. 2017లో 114వ స్థానానికి దిగజారింది. రాజకీయ సా«ధికారత విషయంలో క్షీణత నమోదైంది. సామాజిక విశ్లేషకుల ప్రకారం–ఆర్థిక కార్యకలాపాల్లో స్త్రీల భాగస్వామ్యం పెరిగినప్పటికీ, పదోన్నతుల్లో, వేతనాల్లో వివక్ష కొనసాగుతోంది. పురుషులతో పోల్చుకుంటే స్త్రీలకు సగటున 33 శాతం తక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్టు ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ తాజా నివేదిక చెబుతోంది. దాదాపు ఏ ఒక్క దేశమూ ఈ అణచివేతకు అతీతం కాదని అధ్యయనాలు చెబు తున్నాయి. ఐక్య రాజ్యసమితి ప్రకారం – నాలుగు కోట్లకు పైగా జనాభా వున్న 32 దేశాల్లో అతి తక్కువ పిల్ల లున్న దేశం జపాన్ (12.3%). ఈ లోటు ఆర్థిక వృద్ధిని దెబ్బ తీస్తుందంటున్న ప్రభుత్వం– జననాల రేటు పెంచాల్సిన అతి పెద్ద కర్తవ్యాన్ని స్త్రీలపై మోపింది. ఒంటరి స్త్రీలు ఆర్థిక వ్యవస్థకు భార మంటున్నారు అధికార పార్టీ ఎంపీ కంజి కటో. స్త్రీలు కనీసం ముగ్గురు పిల్లల్ని కని తీరాలని చెబు తున్నారు. గతంలో ఆరోగ్యమంత్రిగా పనిచేసిన హకువో యనజినవా.. స్త్రీలను ‘పిల్లల్ని కనే యంత్రాలు’గా వ్యాఖ్యానించారు. పిల్లల సంరక్షణ చూసుకునే డే కేర్ సెంటర్లు పెంచడంపై ఇటీవల కాలం వరకూ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. 2017 ఏప్రిల్ నాటికి 26000 మంది పిల్లలు అ«ధీకృత డే కేర్ సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నట్టు జపాన్ పత్రికలు చెబు తున్నాయి. మొత్తంగా మార్కెట్ యావలో కొట్టుకు పోతున్న దేశాలకు మహిళల హక్కులూ అవసరాల గురించిన స్పృహే లేకుండాపోతోందని ఈ పరిణా మాలు రుజువు చేస్తున్నాయి. అసమానతల్ని పెంచు తున్న ఇలాంటి అభివృద్ధి నమూనాల్ని దేశాలు సమీ క్షించుకోవాల్సివుంది. వి. ఉదయలక్ష్మి, సాక్షి ప్రతినిధి -
కులరహిత సమాజం దిశగా...
అస్పృశ్యతపై సాగుతున్న పోరాటం ఫలించాలంటే కులాంతర వివాహం చేసుకున్న వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనం చేయాలి. ఒకటి రెండు తరాల పిదప ఎవరి కులం ఏమిటో తెలియని పరిస్థితే కులాతీత సమాజానికి నాంది. గుణకర్మలను అనుసరించి చాతుర్వర్ణాలు ఏర్పడ్డాయన్న గీతావాక్యానికి ఎప్పుడు, ఎవరు సవరణ తెచ్చారో తెలీకుండానే హిందూ సమాజంలో పంచముల పుట్టుక, అంట రానితనం చోటు చేసుకున్నాయి. ఆర్థిక, సాంఘిక, రాజకీయ సాంస్కృతిక పరిస్థితుల్లో మార్పుల ఫలితంగా సమాజంలో పొడసూపిన కొన్ని రుగ్మతలు స్వల్పకాలంలో సర్దుకోవడాన్ని చూస్తుంటాం. అలా సమసిపోని రుగ్మతలు సాంఘిక దురాచారాలుగా బలం పుంజుకుని స్థిరపడతాయి. అంటరానితనం సైద్ధాంతిక దోషమని ప్రకటిం చిన ఆది శంకరులు కాశీ నగరంలో మానిషా పంచకం వెలువరించారు. వారి బోధను ఆచరించడం ఇష్టంలేని పెద్దలు ఆ చారిత్రక ఘట్టాన్ని తమకు సానుకూలంగా మార్చుకున్నారు. అంటరానితనాన్ని రూపుమాపడానికి మానిషా పంచక శక్తి చాలలేదు కానీ, సామాజిక సమరసతకు ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతం ఊతమిచ్చింది. ఆ తరువాత రామానుజుల నుంచి గాంధీజీ వంటి సంస్కర్తలెందరో అంటరానితనాన్ని రూపు మాపాలని ప్రయత్నించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా జ్యోతిబా ఫూలే, డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ వంటి పలువురు మహనీయులు పోరాడారు. సమాజ ప్రగతికి కుల వ్యవస్థ అవరోధంగా మారిందని వంద ఏళ్ల క్రితమే హిందూ సమాజం గ్రహించింది. ఆర్యసమాజ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి, శ్రద్ధానంద వంటి సంస్కర్తలు కులభేదాలను నిర్మూలించాలని ప్రయత్నించారు. ఆంధ్రప్రాంతంలో గోరా వంటి నాస్తికోద్యమకారులు కులనిర్మూలనకు కృషిచేశారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొంటూనే వైద్య పట్టభద్రులు ఒకరు విభిన్నంగా ఆలోచించారు. ఇతరులతో పోల్చితే అన్ని అంశాల్లో సర్వ ప్రథమంగా నిలచిన జాతి కేవలం కుల భేదాలవల్ల విఘటితమై బలహీనపడిందని, కొద్దిమంది విదేశీయుల చేతిలో పరాజిత అయి, బానిసగా మిగిలిం దని నిర్ధారించారాయన. అసలు రుగ్మతకు చికిత్స జరపడమే సరయిన పరిష్కారం అని భావించిన డా.కేశవరావు బలిరామ్ హెగ్డెవార్ కులాలకు అతీతంగా హిందూ సమాజాన్ని ఐక్యం చేయాలని సంకల్పిం చారు. హిందూ సమాజ ఐక్యతలో భాగంగానే అంట రానితనం అంతం కావాలని ఆయన ఆశించారు. అంటరానితనం నేరం కాకపోతే మరేదీ నేరం కాదని ఆరెస్సెస్ అధినేత బాలాసాహెబ్ దేవరస్ అన్నారు. రాజకీయ సమానత్వం ద్వారా దళితులకు సామాజిక సమానత్వం ప్రాప్తిస్తుందని అంబేడ్కర్ భావిం చారు. ఆ దృష్టితోనే ఆయన రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పొందుపరిచారు. స్వతంత్ర భారత పాలకులు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలుపరుస్తారని, రిజర్వేషన్ సౌకర్యాలను ఉపయోగించుకుని ఆయా వర్గాల ప్రజలు పదేళ్ల కాల వ్యవధిలో విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభ్యున్నతి సాధిస్తారని ఆయన ఆశించారు. కానీ అధికార పీఠాలను అధిష్టించిన పెద్దల అల్పబుద్ధి కారణంగా రిజర్వేషన్లు సక్రమంగా అమలు కాలేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి మూడు దశాబ్దాలు గడచినా దళితవర్గాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుందని 1980లలో గణాంకాలతో సహా ఏబీ వాజ్‌పేయి పార్లమెంటులో ఎలుగెత్తిన పిదప కొంత కదలిక మొదలైంది. అమానవీయ నేరాల నిరోధానికి 1955లో ఏర్పడిన చట్టం 1976లో పౌరుల హక్కుల రక్షణ చట్టంగా రూపాంతరం చెందింది. అయినా ఫలితం కనిపించక ప్రజాందోళనల నేపథ్యంలో 1989లో దానికి సవరణలు తెచ్చారు. ఆపైన అది ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంగా పేరొంది ప్రచారంలోకి వచ్చింది. చాలాకాలం పాటు కాగితం పులిగా పేరుపడిన ఈ చట్టం ఖాకీలకు దయ, ధైర్యం కలిగినప్పుడు అడపాద డపా ఊపిరి పోసుకునేది. న్యాయస్థానాల ధోరణి కూడా భిన్నంగా లేదు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం దుర్వినియోగమవుతోందనే ఆరోపణపై ఆదేశాలు జారీ చేసే ముందు ఆరుదశాబ్దాల తర్వాత కూడా దళితులు రిజర్వేషన్లు అడుక్కునే పరిస్థితి నుంచి బయట పడలేకపోవడానికి కారకులెవరని ఆలోచించి ఉండాల్సింది కాదా! దళిత ఆవేదనను ఆకళింపు చేసుకోగల హృదయాలు మన న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానాల్లో లేకపోవడం దళిత పక్షానికి శాపమైందని బీజేపీ మాజీ అధ్యక్షులు స్వర్గీయ బంగారు లక్ష్మణ్ వెల్లడించిన ఆవేదన అర్థం చేసుకోతగినదే. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్న ఆయుర్వేద సూత్రాన్ని అనుసరించి స్వార్థపరుల ప్రతిక్రియకు విరుగుడు వ్యూహాన్ని స్వార్థం ఆసరాగానే అమలు చేయాలి. కులం పేరిట స్వప్రయోజనాలను పండించుకోడానికి విశాల హిందూ సమాజ ప్రయోజనాలను తుంగలో తొక్కే స్వార్థపరులను స్వార్థం ఆసరాగానే దారికి తేవాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు కులాంతర వివాహం చేసుకున్న వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనం చేయాలి. ఇది అంత సులువు కాదు. కానీ ఒకటి రెండు తరాల పిదప ఎవరి కులం ఏమిటో తెలియని పరిస్థితి దాపురించి, రిజర్వేషన్ సౌకర్యం పొందడానికి కులాంతర వివాహం చేసుకోవాలని ప్రయత్నించడం కష్టమై కులాలకు అతీ తంగా సమాజం పురోగమించగలదు. వ్యాసకర్త అధ్యక్షులు, ఏకలవ్య ఫౌండేషన్ పి. వేణుగోపాల్ రెడ్డి మొబైల్ : 77022 52011 -
కేంద్ర సహకారం లేదనడం అవాస్తవం
సాక్షి, న్యూఢిల్లీ: పలు పథకాలకు నిధులు, సంస్థల మంజూరులో కేంద్రం తెలంగాణ పై వివక్ష చూపు తోందని మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రం తెలంగాణకు అన్ని రకాలుగా సహకారం అందిస్తోందని, విద్యాసంస్థలు, కేంద్ర పథకాలకు నిధుల మంజూరులో పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థల ఏర్పాటు విషయమై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను బుధవారం ఢిల్లీలో కలసి వినతిపత్రాన్ని ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో ఐఐటీ పనులను, గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాల న్నారు. ఇఫ్లూ వర్సిటీలో ఉద్యోగులకు కేంద్రమే 100% ప్రయోజనాలు కల్పించా లని, సెంట్రల్ వర్సిటీలో మౌలిక సదుపా యాల కల్పనకు నిధులు విడుదల చేయా లని కోరారు. సర్వశిక్షా అభియాన్, రూసా కింద తెలంగాణకు రూ.149 కోట్లు విడు దల చేసేందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. -
దారుణం: దళితుల బావిలో విషం
సాక్షి,బెంగళూరు: ‘అంటరాని తనం నేరం’ ఈ రాజ్యాంగ నిబంధనను గత కొన్ని దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం. అయినా సామాజిక అణచివేత, వివక్ష దళితుల పాలిట ఒక శాపంగా గానే కాదు..మరణశాసనంలా పరిణమిస్తోందనడానికి నిదర్శనంగా నిలిచింది ఓ సంఘటన. కర్ణాటకలోని ఓ గ్రామంలో ఆధిపత్ యకులాల అమానుషానికి అద్దం పట్టిన ఉదంతమిది. ఒకవైపు మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా వైపు దేశం పరుగులు పెడుతోంటే.. మరోవైపు దళితులపై వివక్ష మాత్రం మరింత వికృత రూపం దాలుస్తోంది. కలాబూర్గి జిల్లాలోని చానూర్ గ్రామంలో, ఆధిపత్య సమాజానికి చెందిన వ్యక్తులు దళితుల వాడే తాగునీటి బావిలో విషాన్ని కలపడం కలకలం రేపింది. రాజధాని బెంగళూరుకు 640 కి.మీ దూరంలో ఉన్న గ్రామంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. చానూర్ గ్రామంలో మొత్తం ఏడు బావులుండగా, ఊరి చివర ఉన్న బావి మాత్రమే దళితులకు శరణ్యం. అయితే వ్యవసాయ భూమికి అనుసంధానంగా ఉన్న దళిత సభ్యుడికి చెందిన ఈ బావిని నాలుగు సంవత్సరాల క్రితం ఉన్నత కులానికి చెందిన గొల్లలప్పగౌడ లీజుకు తీసుకున్నారు. ఇక అప్పటినుంచి దళితులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. లీజుకు తెచ్చుకున్నప్పటి నుంచి గోల్లలప్పగౌడ దళితులను అడ్డుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో బావినుంచి నీటి సరఫరాకోసం ఒక పంప్‌ను ఏర్పాటు చేసుకున్నారు దళితులు. అయితే ఆగష్టు 29 పంప్నుంచి ఈ నీరు సరఫరా కూడా ఆగిపోవడంతో దళిత యువకుడు మహంతప్ప నీటికోసం బావి దగ్గరికి వెళ్లాడు. ఈ సందర్భంగా నీళ్లలో ఏదో కలిపినట్టుగా అనుమానించి, వెంటనే గ్రామస్తులను అప్రమత్తం చేశాడు. దళిత సంఘంలోని కొంతమంది సభ్యులు ఈ సంఘటనను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. రూరల్ డీఎస్‌పీఎస్ ఎస్ హుల్లూర్ అందించిన సమాచారం ప్రకారం చంపేస్తానంటూ దళితులను గొల్లలప్పగౌడ అనేకసార్లు బెదిరించాడనీ, తరచూ తాను చనిపోయే ముందు కనీసం ఒక దళితుడినైనా హత్య చేస్తానని హెచ్చరించేవాడనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో జ్యూరుగీ పోలీసు స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు చేశామన్నారు. అంతేకాదు చాలాసార్లు చనిపోయిన కుక్కల్నీ, పిల్లుల్నీ, పాముల్నీ తీసుకొచ్చి బావిలో పడవేసేవాడనీ, అయినా దళితులు నీటిని శుభ్రం చేసుకుని వినియోగించుకునేవారని డీఎసీపీ చెప్పారు. మరోవైపు విష ప్రయోగంతో దళితులు వాడుకునే బావిని పూర్తిగా ఖాళీ చేయించారు స్థానిక అధికారులు, పోలీసులు. అయితే మిగిలిన ఏడు బావుల్లో నీటిని తోడుకునేందుకు నిందిత సామాజికవర్గం, గ్రామంలోని ఇతరులు అడ్డుకోవడం గమనార్హం. -
పాఠ్యాంశంగా పూలే జీవితం
► ఆయన పేరుతో బీసీ స్టడీ సర్కిళ్లు.. ► జిల్లా కేంద్రాల్లో బీసీ భవన్ల ఏర్పాటుకు కృషి ► శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణియాదవ్ కర్నూలు(అర్బన్): అంటరానితనం, అవిద్య, అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల గుండెల్లో ఆరాధ్యుడిగా నిలిచి పోయారని శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణియాదవ్ కొనియాడారు. పూలే 190వ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక బిర్లాగేట్ సమీపంలోని ఆయన విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా నేతలు, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. చక్రపాణియాదవ్ మాట్లాడుతూ అప్పట్లో సంపన్న వర్గాలు, అగ్రకులాలకే పరిమితమైన విద్యను పూలే.. అణగారిన వర్గా ల వారు, ముఖ్యంగా మహిళలకు చేరువ చేశారన్నారు. తన సతీమణి సావిత్రీబాయిని విద్యార్థినిగా స్వీకరించి చదువు చెప్పి దేశంలోనే తొలి మహిళా టీచర్‌గా తీర్చి దిద్దారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పూలే జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేరుస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్లకు పూలే పేరు పెట్టే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, అన్ని జిల్లాల్లో బీసీ భవన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూలే బాటలో సాగుదాం: గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్యే జ్యోతిరావు పూలే బాల్య వివాహాలు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారని, వితంతు వివాహాలను ప్రోత్సహించారని ఎమ్మెల్యే గౌరుచరిత కొనియాడారు. అందరూ ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. బీసీల అభ్యున్నతికి ఎనలేని కృషి : సీహెచ్ విజయమోహన్, కలెక్టర్ వెనుకబడిన కులాల అభ్యున్నతికి పూలే ఎంతో కృషి చేశారని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. ఆయన స్ఫూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారి అభ్యున్నతికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జేసీ-2 ఎస్ రామస్వామి, దక్షిణాది రాష్ట్రాల ఖాదీ బోర్డు చైర్మన్ చంద్రమౌళి, బీసీ సంక్షేమ శాఖ అధికారి బి. సంజీవరాజు, బీసీ కార్పొరేషన్ ఈడీ లాలా లజపతిరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ప్రసాదరావు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కె. మల్లికార్జునుడు, టీడీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జీ బీటీ నాయుడు, బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నక్కలమిట్ట శ్రీనివాసులు, ఎం రాంబాబు, రజక సంఘం రాయలసీమ కన్వీనర్ వాడాల నాగరాజు, దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దాశెట్టి శ్రీనివాసులు, బీసీ,ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఏదో ఒక రూపంలో ఇంకా పాటిస్తున్నాం!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ప్రగతి పథంలో దూసుకుపోతున్న నవనాగరీకులు దురాచారాలు, మూఢనమ్మకాల విషయంలో నేలచూపులే చూస్తున్నారు. భారతవని దాస్యశృంఖాలు తెంచుకుని ఆరున్నర దశాబద్దాలు గడుస్తున్నా నేటికి కొన్ని దురాచారాలు కొనసాగుతుండడం తలదించుకోవాల్సిన విషయం. అక్కడక్కడా వెలుగు చూస్తున్న అనాగరిక ఆనవాళ్లే ఇందుకు రుజువు. అంటరానితనాన్ని పూర్తిగా పారద్రోలామన్న దాంట్లో వాస్తవం లేదని తాజా సర్వేలో వెల్లడైంది. ఇప్పటికీ అంటరానితనం పాటించే వారు ఉన్నారన్న నిజం నిశ్చేష్టపరుస్తోంది. ఏదో ఒక రూపంలో అన్ టచ్ బిలిటీ అనుసరిస్తున్నామని ప్రతి నలుగురిలో ఒక భారతీయుడు తెలపడం అవాక్కయ్యేలా చేస్తోంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అఫ్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్(ఎన్ సీఏఈఆర్), అమెరికాకు చెందిన మేరీలాండ్ యూనివర్సిటీ జరిపిన భారత మానవ అభివృద్ధి సర్వే(ఐహెచ్‌డీఎస్-2)లో ఈ నిజాలు వెలుగు చూశాయి. అన్ని మతాలు, కులాలకు చెందినవారు అంటరానితనాన్ని పాటిస్తున్నారనే నిజం.. దురాచారాల విషయంలో సమాజం పెద్దగా మారలేదన్న విషయాన్ని కళ్లకు కడుతోంది. త్వరలో విడుదల కానున్న సర్వే నివేదికలో ఇంకా ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తాయోనని బుద్ధిజీవులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ కులం పేరు అడిగి ఇళ్లు అద్దెకు ఇచ్చే వారు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సి పనిలేదు. 'కులం కూడు పెట్టదు, మతం మంచి నీళ్లు పోయదు' అన్న ఎవరికీ పట్టడం లేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శిఖరస్థాయిలో ఉన్నామని చెప్పుకుంటున్న వర్తమానంలో దురాచారాల ఆనవాళ్లు అగుపడడం విడ్డూరం. కులాభిమానంలో కొట్టుకుపోతున్న వారిలో పెద్ద చదువు చదవిన వారు సైతం ఉండడం ప్రమాదకర సంకేతం. పరిస్థితి ఇలాగే కొనసాగితే అంటరానితనం అమానుషమన్న గతకాలపు ఘోషలు మళ్లీ గుర్తుచేయాల్సి ఉంటుంది. సగటు మనిషిని గౌరవించని విజ్ఞానం వేస్ట్ అని ఛీత్కరించాల్సి వస్తుంది. వివేకం నేర్పని విద్యకు విలువ ఉండదని నినదించాల్సి రావొచ్చు. మానవత్వమే మతమని, సహనమే ఆభరణమని పాఠం వినిపించాల్సి ఉంటుంది. స్వయం విచక్షణతోనే అంతరానితనాన్ని తరిమికొడితే అంతకంటే మంచిపని మరోటి ఉండదు. మనుషులందరినీ సమదృష్టితో ఆదరిస్తే అన్ టచ్ బిలిటీ పూర్తిగా అంతర్థానమవుతుంది. మహాత్ముని కల సాకారమవుతుంది. -పి. నాగశ్రీనివాసరావు -
ఆ కంచెను కత్తిరించాలి
కొత్త కోణం 1981 నుంచి ఇప్పటివరకు జనాభా పెరుగుదలకనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచక పోవడం వల్ల కేంద్ర ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీలు తమ వాటాను గణనీయంగా కోల్పోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వేలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, విద్యాలయాలు, ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన ఉద్యోగాల వాటాను గత 30, 35 ఏళ్లుగా ఆ వర్గాలు నష్టపోతున్నాయి. అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నియామకాల్లోనూ ఎస్సీ, ఎస్టీ యువకులు అవకాశాలను కోల్పోతున్నారు. ‘‘భారత సామాజిక నిర్మాణం నాలుగు శ్రేణులుగా జరిగింది. మొదటి శ్రేణిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు ఉన్నాయి. రెండవ శ్రేణి శూద్రు లది. వీరు వర్ణవ్యవస్థలో భాగం. ఆదివాసీ తెగలు, మైదాన ప్రాంతంలో నేర గాళ్లుగా ముద్ర పడిన కొన్ని తెగలది మూడవ శ్రేణి. నాలుగవ శ్రేణి అంటరాని కులాలు. మూడు, నాలుగుశ్రేణులు కలిపి అవర్ణకులాలు. వర్ణవ్యవస్థలో మొదటి శ్రేణికి చెందిన మూడు కులాలు ద్విజులు. వీరికి కుల సమాజంలో ప్రత్యేకమైన హక్కులుంటాయి. శూద్రుల మధ్య తేడా ఉన్నమాట వాస్తవం. ఈ తేడా ఒకరి నుంచి మరొకరిని వేరు చేయడానికి ఉద్దేశించినది కాదు. అలాగే శూద్రకులాలూ, అవర్ణ కులాలలోని ఆదివాసీ, నేరగాళ్లుగా ముద్ర వేసిన తెగలకూ మధ్య తేడా ఉంది. అది కూడా ద్వేషపూరితం కాదు. కానీ నాలుగవ శ్రేణిలో ఉన్న అంటరాని కులాలకూ మిగతా కుల సమాజంలోని అన్ని సమూహాలకూ నడుమ ఉన్న తేడా ఇనుప కంచెలాంటిది. ఇది తొలగిం చలేనంత బలమైనది.’’ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నమాటలివి. అంబే ద్కర్ రచనలలో అయిదవ సంపుటిలో పొందుపరిచిన ఈ అవగాహనా సారం ఇప్పటికీ కళ్లకు కట్టిన ట్టే ఉంది. అమలు దగ్గరే అసలు తంటా రాజ్యాంగంలో ఎన్నో రక్షణలు ఉన్నప్పటికీ, వాటి ఆధారంగా ఎన్ని చట్టాలు రూపొందుతున్నప్పటికీ ఆచరణలో అవి ఇస్తున్న ఫలాలు మాత్రం అరకొర గానే ఉంటున్నాయి. ముఖ్యంగా విద్య, ఉద్యోగ రిజర్వేషన్లలో ఉన్న రక్షణ అమలులో చాలా నిర్లక్ష్యం కనిపిస్తున్నది. చట్టాలు కూడా అమలులో ఎటు వంటి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. రాజకీయ పార్టీలు సైతం చాలా రాష్ట్రాల్లో అంటరాని కులాలపట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి. సంవత్సరం క్రితం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీల ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వే షన్ బిల్లు ప్రతులను తమ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఆదేశాల మేరకు సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు చింపి, చట్టం కాకుండా అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళిత వ్యతిరేకత మీద ఆధారపడి పాలన సాగిస్తున్నారు. నిజా నికి తరతరాలుగా దూరంగా ఉండిపోయిన ఎస్సీలను ఈ సమాజం అక్కున చేర్చుకోవాల్సింది పోయి దాడులకూ, అత్యాచారాలకూ పాల్పడుతున్నది. చట్టాలతో రక్షణ, ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేకుంటే ఇక మిగిలేది వివక్ష మాత్రమే. రాజ్యాంగం రక్షణ కల్పించిన తరువాత చైతన్యంతో ముందుకు సాగుతున్న దళిత సమాజంపై భౌతిక దాడులు, హత్యలు పెరిగాయి. ఇది ఇక్కడితో ఆపకుండా పద్ధతి ప్రకారం విద్య, ఆరోగ్యం, ఇతర రంగాల్లో ఈ వర్గాలకు అవకాశాలు అందకుండా పథకం వేస్తున్నారు. ప్రభుత్వ పాఠశా లల్లో, ప్రభుత్వ వైద్యశాలల్లో దళితులు ప్రవేశిస్తున్నారని గ్రహించిన ఆధిపత్య కులాలు వాటినే వెలివేశాయి. ప్రతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూటికి 80 శాతం మంది ఎస్సీలు ఉండడమే దీనికి కారణం. ఇక్కడ ఒక విషయాన్ని పరిశీలించాలి. అంటరానికులాలకూ, ఆదివాసీ లకూ రాజ్యాంగం ఇస్తున్న రక్షణల ఆధారంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. 16(4), 16(4)ఎ, 335 ఆర్టికల్స్ ప్రకారం ఈ రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి. వీటి అమలులో కేంద్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయనడానికి ఇంతవరకు జరిగిన ఆచరణే గీటురాయి. గత ముప్పయ్ ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రావా ల్సిన వాటాను అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నిజానికి బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ, వారిని విస్మరిస్తున్నాయనడం సబబు. స్వాతంత్య్రానంతర చరిత్రను పరిశీలిస్తే రిజర్వేషన్ల అమలులో జరిగిన లోపాలు బహిర్గతం అవుతాయి. దేశం స్వాతంత్య్రం పొందడానికి ముందే 1943లో మొదటిసారిగా అంబేద్కర్, గాంధీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అధికారికంగా రిజర్వేషన్ల అమలు ప్రారంభమైంది. ఆ రోజు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కేవలం 8.33 శాతం రిజర్వేషన్లను అమలు చేశారు. స్వాతంత్య్రం వచ్చాక 1947 సెప్టెంబర్ 21వ తేదీ నుంచి వాటిని 12.5 శాతానికి పెంచారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత మొదటి సారిగా ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను కల్పించారు. అయితే అప్పటి వరకు అమలు చేసిన రిజర్వేషన్లన్నీ జనాభా ప్రాతిపదికన జరిగినవి మాత్రం కాదు. మొదటిసారిగా 1961 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం కేటాయించి, 1970 మార్చి 25న వాటిని అమలులోకి తీసు కొచ్చారు. ఇది తొమ్మిదేళ్లు ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవే లెక్కలను కేంద్రం పరిగణనలోనికి తీసుకుంటున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పెరిగిన జనాభా ఆధారంగా రిజర్వేషన్లను అమలు చే స్తున్నాయి. 1981లో ఎస్సీలు 15.8 శాతం, ఎస్టీలు 7.8 శాతం ఉన్నారు. అంటే ఎస్సీ లకు 16 శాతం, ఎస్టీలకు 8 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఏ సంఖ్యలోనైనా 0.5 శాతం లేదా ఆ పైన పెరుగుదల ఉంటే అది ఆ తరువాత సంఖ్యగా మారు తుంది. కానీ కేంద్ర ప్రభుత్వాలు పెరిగిన జనాభా లెక్కల ప్రకారం రిజర్వే షన్లను అమలు చేయడం లేదు. మిగతా సంవత్సరాల లెక్కలను చూసినా జనాభా పెంపుదల ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలి. 1991 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు 16.5 శాతం, ఎస్టీలు 8.1 శాతానికి పెరిగారు. 2001 లెక్కల ప్రకారం ఎస్సీలు 16.2, ఎస్టీలు 8.2 శాతంగా ఉన్నారు. ఈ మేరకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలి. కానీ దళిత, ఆదివాసీల పట్ల ఏ మాత్రం శ్రద్ధలేని ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరించాయి. పెరిగిన జనాభాను పరిగణలోనికి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. 2011 లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా 16.6 శాతం, ఎస్టీల జనాభా 8.6 శాతంగా నమోద య్యింది. అంటే ఎస్సీల రిజర్వేషన్లు 17 శాతం, ఎస్టీల రిజర్వేషన్లు 9 శాతం పెరగాలి. కానీ ఇప్పటికీ రిజర్వేషన్ల పెంపు పట్ల ఎటువంటి నిర్ణయాలు తీసు కోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికీ, దళిత వ్యతిరేక తత్వానికీ అద్దం పడుతోంది. అట్టడుగు వర్గాలకు అపార నష్టం 1981 నుంచి ఇప్పటివరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచకపోవడం వల్ల కేంద్ర స్థాయిలో ఉన్న ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీలు తమ వాటాను గణనీయంగా కోల్పోతున్నారు. ప్రభుత్వ రంగ సం స్థలు, రైల్వేలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, విద్యాలయాలు, ప్రభు త్వంలోని వివిధ విభాగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన ఉద్యోగాల వాటాను గత 30, 35 ఏళ్లుగా ఆ వర్గాలు నష్టపోతున్నాయి. అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నియామకాలలోనూ ఎస్సీ, ఎస్టీ యువ కులు అవకాశాలను కోల్పోతున్నారు. ఏ రాజకీయ పార్టీ దీనిపై దృష్టి పెట్టక పోవడం విచారకరం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు సమాజంలోని కుల స్వభావం ఎస్సీల పట్ల ఒక వ్యతిరేక భావాన్ని కలిగి ఉండడం వల్ల, ప్రభుత్వాలు ఆ ప్రభావానికి లొంగిపోతున్నట్టు రుజువవుతున్నది. అందువల్ల రాజ్యాంగంలో హక్కులు ఉన్నప్పటికీ, విధాన నిర్ణయాలు జరిగినప్పటికీ అవి అమలుకు నోచుకోవు. అందుకే దేశం ఒక జాతిగా నిర్మాణం కావడానికి కుల సమాజం అడ్డంకిగా ఉంటుంది. అంబేద్కర్ భావించినట్టు ‘‘కులం పునాదుల మీద ఒక జాతిని, నీతిని నిర్మించలేం’’అనేది కూడా రుజువవుతున్నది. భారతదేశంలో ఒక ఆదర్శ సమాజం ఏర్పడడానికి కులం బలమైన అడ్డంకిగా మారింది. మనిషి శక్తి, అర్హతలను బట్టికాక, కులం అనే ఒక ముద్రతో అన్ని అవకాశా లను కొన్ని కులాలే పొందుతున్నాయి. అందుకే భారత రాజ్యాంగ రచనా సమయంలో సుదీర్ఘ చర్చ జరిపి ఎవరైతే సామాజికంగా, ఆర్థికంగా వివక్షకు గురవుతున్నారో అటువంటి కులాలకు, వర్గాలకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలని భావించారు. అదేవిధంగా, ప్రజాస్వామిక ప్రాథమిక సూత్రం ప్రాతినిధ్యమే. అంటే దేశ పాలనలో, అభివృద్ధిలో, అవకాశాలలో సమాన భాగస్వామ్యం ఉండాలనేది దానర్థం. ప్రత్యేక సదుపాయాలు లేదా రిజర్వే షన్లు లేకుంటే ఎస్సీ, ఎస్టీలు భాగస్వామ్యం పొందలేరనేది ఆనాటి రాజ్యాంగ నిర్మాతల అభిప్రాయం. ఇది మన అనుభవం మాత్రమే కాదు. అమెరికా కూడా ఆఫ్రో-అమెరికన్లకు ప్రత్యేక అవకాశాలను కల్పిస్తున్నది. అయితే అమెరికాలో వలె కాకుండా భారతదేశంలో చట్టాలు సమాజం ఆధిపత్యం ముందు వీగిపోతాయి. ఆపై నిరుపయోగమైపోతాయి. ఇక్కడ చట్టాలు అమలు జరగాలంటే సమాజంలో వున్న దళిత వ్యతిరేకత రూపు మాసిపోవాలి. అప్పుడే మార్పు కనిపించే అవకాశం ఉంది. నూటికి పావు భాగంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలను అభివృద్ధిలో భాగం చేయకపోతే ఎప్పటికీ ఈ దేశం సమగ్రాభివృద్ధిని సాధించలేదు. కాబట్టి ఆధిపత్య కులాల్లోని ప్రజా స్వామిక, ప్రగతిశీల శక్తులు ఇటువైపు దృష్టి సారించాలి. శరీరంలో ఒక భాగం రోగగ్రస్తమైనప్పుడు ఆ భాగానికి చికిత్స చేయకుంటే వ్యక్తి సంపూర్ణ ఆరోగ్య వంతుడు కాలేడు. నిత్య దారిద్య్రం, నిరుద్యోగం, అవమానం వంటి సమ స్యలతో కొట్టుమిట్టాడుతున్న ఎస్సీ, ఎస్టీలను విస్మరిస్తే దేశం పురోగమించడం అసాధ్యం. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 9705566213 -
అస్పృశ్యత ఇంకెంత కాలం?
విశ్లేషణ అంటరానితనం దేశవ్యాప్తంగా విస్తృతంగా అమలవుతోందని ఎన్సీఏఈఆర్ తాజా సర్వేలో వెల్లడైంది. రెండున్నర వేల ఏళ్లుగా ఉనికిలో ఉన్న అస్పృశ్యత ఇంకా బలంగా కొనసాగడానికి ప్రధాన కారణం హిందూ సమాజం మెదళ్లలో ఉన్న గుడ్డి వ్యతిరేకతే. దళిత కులాలతో సామరస్యంగా వ్యవహరించకపోవడం, వారిని తమతో సమానమైన మనుషులుగా గుర్తించకపోవడం, వారి అవకాశాలను అడ్డుకోవడం వంటివన్నీ కుల సమాజ లక్షణాలే. వారి వెనుకబాటుకు కారణాలే. ఇంకెన్నాళ్లీ రిజర్వేషన్లు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది హిందూ సమాజం. ఆ మాటకొస్తే దళితేతర సమాజమే. ఆరున్నర దశాబ్దాలుగా భారత రాజ్యాంగం అమలులో ఉన్నా, నేటికీ అంటరానితనాన్ని పాటిస్తున్నామని బహిరంగంగా అంగీకరించే వారు చాలా మందే ఉన్నారు. దాదాపు అన్ని కులాల వారు తర తమ స్థాయిల్లో అంటరానితనాన్ని పాటిస్తున్నామని తమదైన భాషలో ఆ విషయాన్ని చెబుతున్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎస్.సి.ఎ.ఈ.ఆర్.) సంస్థ ఇటీవల జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘భారత మానవ అభివృద్ధి సర్వే’ పేరిట ఈ సంస్థ దేశవ్యాప్తంగా 42 వేల ఇళ్లను సర్వే చేసింది. 2015లో సర్వే పూర్తి వివరాలను వెల్లడిస్తారు. 2011-12లో నిర్వహించిన ఈ సర్వేకు డాక్టర్ అమిత్ థోరాట్ ప్రధాన పరిశోధకులు. బ్రాహ్మణులు, అగ్రకులాలు, ఓబీసీలను విడివిడిగా వారి అభిప్రాయాలను అడిగారు. ఇందులో 52 శాతం బ్రాహ్మణులు, 24 శాతం అగ్రకులాల వారు, 33 శాతం ఓబీసీలు అంటరానితనాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. మతాల వారీగా, హిందువులు 35 శాతం, జైనులు 30 శాతం, సిక్కులు 23 శాతం, ముస్లింలు 18 శాతం, క్రైస్తవులు 5 శాతం, బౌద్ధులు ఒక శాతం అంటరానితనాన్ని ఆచరిస్తున్నామని తెలిపారు. ఈ లెక్కలు అంటరానితనం అమలవుతున్న తీరును, దాని తీవ్రతను మాత్రమే తెలియజేస్తాయి. నిజానికి అంటరానినాన్ని పాటిస్తున్నా ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోని వారు ఇంతకంటే ఎక్కువగానే ఉంటారు. ‘‘తప్పు అంటరాని కులాలది కాదు’’ అంటరానితనాన్ని, కులాల అంతరాలను సమసిపోయేట్టు చేయాలని ఇప్పటికే చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. స్వాతంత్య్రం పొందిన అనంతరం మనం రూపొందించుకున్న రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిషేధించే నిబంధనను కూడా ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా నాటి నాయకులు ఆశించిన ఫలితాలు ఇంకా పూర్తిగా అనుభవంలోకి రాకపోవడం విచారకరం. 1949 నవంబర్, 29వ తేదీన భారతదేశం ఒక చరిత్రను సృష్టించింది. అప్పటి వరకు అంటరానితనంపై ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేవు. పైగా అందుకు ధర్మశాస్త్రాల ఆమోదం ఉండేది. అయితే చరిత్రాత్మకమైన ఆ రోజు హేయమైన, సిగ్గుచేటైన ఈ దురాచారానికి చట్టపరంగా ముగింపు పలికింది. ఆనాటి చర్చలో పాల్గొన్న నజీరుద్దీన్ అహ్మద్, వి.ఎల్.మునిస్వామి పిళ్లై, డాక్టర్ మన్మోహన్ దాస్, శ్రీమతి దాక్షాయణి వేలాయుథన్, కె.టి.షా, శంతన్ కుమార్ దాస్ తదితరులు అంటరానితనం నిర్మూలనను చరిత్రాత్మక బాధ్యతగా పేర్కొన్నారు. మన్మోహన్ దాస్ మాట్లాడుతూ... ఇంతవరకూ అంటరాని వారిగా ఉన్న వారికి 1949 నవంబర్, 29 ఎన్నటికీ మరువలేని రోజు అని అభివర్ణించారు. రాజ్యాంగ నిర్ణాయక సభకు ైచైర్మన్‌గా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ చర్చను నడిపించిన తీరును ప్రత్యేకించి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆయన అంటరానితనాన్ని పాటిస్తున్న కులాలకు, సమూహాలకే సభలో ఎక్కువగా మాట్లాడే అవకాశమిచ్చారు. అంబేద్కర్ సభాధ్యక్ష పాత్రకే పరిమితమయ్యారు. వాదనా పటిమతో కూడిన గంభీరోపన్యాసాలు చేసే ప్రయత్నమే చేయలేదు. ఎందుకంటే, అంటరానితనం నిర్మూలన బాధ్యత హిందూ సమాజ నాయకులదేనని ఆయన భావించారు. అంటరాని కులాలు మాత్రమే ఆ దురాచారాన్ని నిర్మూలించాలనుకుంటే అది సాధ్యం కాదని ఆయన అభిప్రాయం. 1946లో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబేద్కర్ సరిగ్గా అదే అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చారు: ‘‘అంటరాని కులాలు మొదటి నుంచి ఈ సమాజంలో భాగం కావాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ హిందూ కులాలే అందుకు అంగీకరించడం లేదు. చాలా మంది భ్రమపడుతున్నట్టు ఇది అంటరాని కులాల తప్పు కాదు. అంటరాని వాళ్లుగా ఉండాలనే కోరిక వారికి లేదు. హిందూ కులాల మనసుల్లో పరివర్తన కలగాలి. అప్పుడే వారు సమా జంలో కలసిపోవడం సాధ్యమవుతుంది. అంతవరకు ఇది ఒక స్వప్నంగానే మిగిలిపోతుంది. హిందూ సమాజం, దాని సంప్రదాయాలే అంటరానితనానికి మూలం’’ అని స్పష్టం చేశారు. దళితేతర సమాజానిదే బాధ్యత ఇంకా హిందూ సమాజం కులాన్ని, అంటరానితనాన్ని పాటిస్తున్నందువల్లనే ఎన్.సి.ఎ.ఈ.ఆర్. సర్వేలో అంటరానితనం విస్తృతంగా ఉన్నట్టు తేలింది. రెండున్నర వేల ఏళ్లుగా ఉనికిలో ఉన్నట్టు తెలుస్తున్న అంటరానితనం ఇంకా బలంగా కొనసాగడానికి ప్రధాన కారణం హిందూ సమాజం మెదళ్లలో ఉన్న గుడ్డి వ్యతిరేకతే. కుల భేదాలు ఉన్నప్పటికీ విభిన్న కులాల మధ్య ఉన్న వైరుధ్యాలు క్రూరంగా ఉండవు. కానీ మొత్తం సమాజానికి, అంటరాని కులాలకు మధ్య ఉన్న భేదం పూర్తిగా శత్రుపూరితంగా మారింది. దీనికి రాజకీయ సామాజిక కారణాలున్నాయి. బౌద్ధాన్ని అనుసరించే వాళ్లను ఆనాటి హిందుత్వ శక్తులు క్రూరంగా అణచివేశారని, మిగిలిన కొద్ది మందిని సమాజం నుంచి వెలివేశారని, వాళ్లే అంటరాని కులాలుగా ఉన్న వాళ్లనే విషయాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ ‘‘అంటరానివారెవరు?’’ అనే తన పరిశోధనల్లో వెల్లడించారు. అయితే ఈ రోజు అది మరింత పెద్ద మానసిక సమస్యగా తయారైంది. ఆర్థిక భేదాలను తొలగించడం ఒక రకంగా సులువు. ప్రభుత్వాలు తలచుకుంటే బలవంతంగానైనా ఆస్తులున్న వారి నుంచి లాక్కొని, అందరికీ సమానంగా పంపిణీ చేయవచ్చు. కానీ కులాన్ని నిర్మూలించాలంటే చట్టాలు, రాజ్యాంగ రక్షణలు మాత్రమే సరిపోవు. సామాజిక పరివర్తన, మానసిక సంసిద్ధత కావాలి. అయితే, హిందూ సమాజం, ఇతర మతాలు పాటిస్తున్న అంటరానితనం వలన అంటరాని కులాలుగా గుర్తింపు పొందుతున్న దళితులు తరతరాలుగా సామాజిక వెలివేతకు, ఆర్థిక దోపిడీకి, రాజకీయ అణచివేతకు గురవుతూ ఉనారు. ముందుగా దీనికి పరిష్కారాలు వెతకాలి. ఇక్కడ హిందూ సమాజంతో పాటు ఇతర మతాల, వర్గాల పాత్ర కూడా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రక్షణలు, సంక్షేమ పథకాలు, అమలులో ఉన్నాయి. కానీ అవి అనుకున్నంతగా అమలు జరగడం లేదు. దీనికి ప్రధాన కారణం దళితేతర సమాజంలో ఉన్న వ్యతిరేకతా భావమే. ఇది పోవాలి. దళిత సమాజం తన పోరాటాలతో ఆ సమస్యలను ఏ మేరకు వెలుగులోకి తెస్తుందనేదే దాని ముందున్న సమస్య. అయితే వాటిని పరిష్కరించే బాధ్యత దళితేతర సమాజానిది మాత్రమేనని గుర్తుంచుకోవాలి. రిజర్వేషన్లు, అత్యాచారాల నిరోధక చట్టం ఇవన్నీ దళితుల రక్షణకు గాక, ఇతరులకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయనే వాదనలు తరచుగా వినిపిస్తుంటాయి. ఇంకెన్నాళ్లీ రిజర్వేషన్లు? అనే ప్రశ్న కూడా పదే పదే ముందుకొస్తుంటుంది. దీనికి సమాధానం చెప్పాల్సింది కేవలం దళితులు కాదు... హిందూ సమాజం. ఆ మాటకొస్తే దళితేతర సమాజం. ఎవరైతే ఈ దేశం, ఈ జాతి అంతా ఒక్కటని భావిస్తున్నారో వాళ్లే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అంటరాని కులాలతో సామరస్యంగా వ్యవహరించక పోవడం, కనీసం వారిని తమతో సమానమైన మనుషులుగా గుర్తించకపోవడం, అడుగడుగునా వారి అవకాశాలను అడ్డుకోవడం వంటివన్నీ కుల సమాజ లక్షణాలే. దళితుల వెనుకబాటుకు ఇవే కారణాలు. దళిత జనాభివృద్ధితోనే దేశాభివృద్ధి అంబేద్కర్ తర్వాత కుల సమస్యపై అంత తీవ్రంగా స్పందించిన వారిలో రామ్ మనోహర్ లోహియా ముఖ్యులు. దళిత, బడుగు కులాలకు అవకాశాల కల్పన వల్లనే కుల సమాజంలోని అంతరాలు కొంత మేరకైనా తగ్గుతాయని ఆయన చెప్పారని గమనించాలి. ఇటీవల అన్ని రాజకీయ వర్గాల నుంచి, ముఖ్యంగా హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శక్తుల నుంచి ఈ అంశంపై కొంత సానుకూల స్పందన వస్తున్నది. ఇది ఆచరణ రూపంలో మరింత శక్తివంతంగా ముందుకు రావాలి. ముఖ్యంగా దళిత యువతలో, విద్యార్థుల్లో నైరాశ్యం నెల కొని ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో అరకొరగా అందిన చదువు వారికి ఎలాంటి బతుకుతెరువును చూపడం లేదు. పైగా భూమి లాంటి ఆర్థిక వనరులు రోజు రోజుకీ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుండటంతో సెంటు భూమి కూడా వారికి మిగలడం లేదు. దాదాపు నూటికి తొంభై శాతం ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలోకి వెళ్లిపోయిన తర్వాత ఉద్యోగ రిజర్వేషన్లు నామ్‌కే వాస్తేగా తయారయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో కులాలకు అతీతంగా అంతా ఐక్యంగా ముందుకు పోవాలనుకునే శక్తులు... జనాభాలో 20 శాతంగా ఉన్న అంటరాని కులాల బాగోగులను పట్టించుకోకపోతే, దేశాభివృద్ధి మిథ్యగానే మిగిలిపోక తప్పదు. ప్రపంచంలోని అన్ని దేశాలకు దీటుగా మన దేశాన్ని నిలబెట్టాలనుకునే కల దళితులు అభివృద్ధి చెందనిదే నెరవేరదు. అందుకే అంటరానితనాన్ని, కులాల అంతరాలను నిర్మూలించడాన్ని అత్యవసరమైన, ప్రథమశ్రేణి ప్రాధాన్యాలలో ఒకటిగా తీసుకుని దృఢ సంకల్పంతో కృషి చేస్తే తప్ప భారతదేశం ప్రపంచంలో తల ఎత్తుకొని నిలబడలేదు. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు-మొబైల్ నం: 9705566213) -
సమానత్వంతోనే సమసమాజం
తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తిరుపతిలో ‘అంటరానితనానికి అంతిమయాత్ర’ సదస్సు తిరుపతి: అంటరానితనం, అసమానతలు సమూలంగా రూపుమాపి, సమానత్వంతో ముందుకు సాగితేనే సమ సమాజ స్థాపన సాధ్యమవుతుందని, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తెలిపారు. ట్రాన్స్ఫామ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఆదివారం అంటరానితనానికి అంతిమయాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. రోశయ్య గౌరవ అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. గతంలో అంటరానితనం అధికంగా ఉండేదన్నారు. ఎందరో మహనీయులు, సంఘసంస్కర్తలు ఎనలేని కృషి చేయడంతో కొంత తగ్గుముఖం పట్టిందన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జె. చలమేశ్వర్ మాట్లాడుతూ ఐక్యతే అభివృద్ధికి మార్గదర్శకమన్నారు. కలసి భోజనం చేయలేని వారు కలిసి యుద్ధం చేయలేరని నాడు భారతీయుల గురించి అలెగ్జాండర్ అన్న మాట లను ఆయన గుర్తు చేశారు. గౌరవ అతిథిగా హాజరైన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. చంద్రభాను మాట్లాడుతూ అంటరానితనం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలోకి వచ్చినప్పుడు దీన్ని నిర్మూలించవచ్చన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానంతో భారతదేశానికి పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో ఆయన చేర్చిన ఆిస్తి పదాన్ని అందరూ వ్యతిరేకించారని తెలిపారు. ఫలితంగా నేడు కౌలు రైతు లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి, ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు పండిట్ భావన్ ఖలాల్ శర్మ, కోట శంకర శర్మ, డాక్టర్ ప్రదీప్ జ్యోతి, తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణన్, మాజీ ఎమ్మెల్సీ, ట్రాన్స్ఫామ్ ఇండి యా ఫౌండేషన్ అధ్యక్షుడు కె.జయచంద్ర నాయుడు అంటరానితనంపై ప్రత్యేకంగా రూపొందించిన సీడీని ప్రొజెక్టర్ ద్వారా ప్రెజెంట్ చేశారు. -
అణచివేతపై తిరుగుబాటు బావుటా!
అంటరానితనానికి, సామాజిక అణచివేతకు, శ్రమను, ఉత్పాదక వృత్తులను నీచంగా చూసే వర్ణ, కుల వ్యవస్థకు, వాటిపై నిలిచిన విలువలకు వ్యతిరేకంగా మొక్కవోని పోరాటం చేసిన అంబేద్కర్... తర తరాలుగా నోరులేని వాళ్లుగానే ఉన్న వారికి ధిక్కార స్వరాన్నిచ్చారు. ఆయన పేరు చెబితే చాలు కోట్లాది పీడిత జనం పిడికిలి బిగిస్తుంది, గడ్డిపోచ కూడా ఖడ్గమై లేస్తుంది . అన్యాయం, అసమానత, అణచివేతల మీద తిరుగుబాటు జెండా ఎగురవేస్తుంది. ఆయనే డాక్టర్ బాబా సాహెబ్ భీమ్రావు అంబేద్కర్. కోట్లాది దళిత, బహుజనుల కంటి కాంతి, ఆలోచనలోని విద్యుత్తు. అంటరానితనానికి, సామాజిక అణచివేతకు, శ్రమను, ఉత్పాదక వృత్తులను నీచంగా చూసే వర్ణ, కుల వ్యవస్థకు, వాటి విలువలకు వ్యతిరేకంగా మొక్కవోని పోరా టం చేసిన ఆయన... తర తరాలుగా నోరులేని వాళ్లుగానే ఉన్న వారికి ధిక్కార స్వరాన్నిచ్చారు. మహాత్మా జ్యోతిబాఫూలేను స్ఫూర్తిగా తీసుకొని ఆయన గొప్ప సామాజిక విప్లవం సాగించారు. కుల వ్యవస్థ కాల కూట విషమైన అంటరానితనాన్ని ప్రశ్నించిన ఆయన స్వాతంత్య్రోద్యమ నేతలు గాంధీ, నెహ్రూలకు భిన్నమైన బాటను చేపట్టారు. భారతీయ సమాజాన్ని అమానుషం చేస్తున్న కుల వ్యవస్థను రూపమాపవలసిన తక్షణ అవసరాన్ని గుర్తు చేశారు. లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలలో దీన్ని కీలక చర్చనీయాంశం చేశారు. గాంధీజీకి అప్రియమైనప్పటికీ షెడ్యూల్డ్ కులాలకు బ్రిటీష్ ప్రభుత్వం నుంచి కొన్ని రాయితీలను సాధించారు. అంబేద్కర్ పుట్టింది ‘అంటరాని’ మహర్ కులంలో. అయినా ప్రపంచలోని అత్యంత విద్యావంతులలో, ప్రతి భావంతులలో ఒకనిగా నిలిచారు. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న విద్యాసంస్థలలో న్యాయ, తత్వ, ఆర్థిక శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేశారు. అమెరికాలోని కొలం బియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. బహు గ్ర ంథ కర్త అయిన ఆయన రచించిన ‘కుల నిర్మూలన’ అత్యంత శక్తివంతమైన రచన. ఆయన కలాన్ని కత్తిని చేసి అంటరానితనం, కుల వ్యవస్థల మూ లాలను ఛేదించి, వాటిలోని దుర్మార్గాన్ని ఎండగట్టారు. తొలి స్వతంత్ర భారత ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి పదవిని చేపట్టారు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీ అధ్యక్షునిగా అనితర ప్రతిభతో ఆ చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించారు. అనేక క్లిష్ట సమస్యలకు, మీమాంసలకు విశాల మానవతావాద, సమ్మిళిత, ప్రజాస్వామిక దృష్టితో అంబేద్కర్ సమాధానాలు, వివరణలు సుప్రసిద్ధమైనవి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పరమాశయాలుగా ప్రాథమిక హక్కులతో కూడిన రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆదేశిక సూత్రాలతో ప్రభుత్వాల నైతిక బాధ్యతలను నిర్వచించి, సమున్నత సమాజ నిర్మాణం దిశను నిర్దేశించారు. మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కులలో చేర్చి మన దేశ లౌకితత్వం పునాదులను రాజ్యాంగబద్ధం చేశారు. బలమైన కేంద్రం, స్వతంత్ర రాష్ట్రాలు కలిసిన సమాఖ్య వ్యవస్థను నిర్వచించారు. దళితులు, ఆదివాసీలు ఇతర వెనుకబడిన తరగతులు, మత మైనారిటీలు, మహిళల తరపున దృఢంగా నిలబడ్డారు. వారిపట్ల సానుకూల వివక్షను, ధర్మపక్షపాతాన్ని చూపే అధికరణలను రాజ్యాం గంలో చేర్చేలా చేసిన ఘనత అంబేద్కర్‌దే. ఆర్టికల్ 17, ఆర్టికల్ 30, ఆర్టికల్ 46 ఆయన పీడిత జన పక్షపాతానికి నిదర్శనాలు. స్త్రీలను బానిసత్వం నుంచి విముక్తం చేయకుండా సమసమాజ నిర్మాణం సాధ్యం కాదని ఆయన భావించారు. అంబేద్కర్ రాజ్యాంగంలో చేర్చిన పలు ప్రత్యేక అధికరణల మూలంగానే పార్లమెంటు పలు విప్లవాత్మక, ప్రజాస్వామిక చట్టాలను చేయగలిగింది. న్యాయశాఖ మంత్రిగా ఆయన హిందువులలో బహు భార్యత్వాన్ని నిషేధించి, మహిళలకు ఆస్తి హక్కు, విడాకుల హక్కు తదితర స్వేచ్ఛలను కల్పించడం కోసం హిందూ స్మృతి బిల్లును రూపొందించారు. దానిని అడ్డుకున్నందుకు న్యాయశాఖ మంత్రి పదవి నుంచి వైదొలిగారు. పునాదులలో సామాజిక ప్రజాస్వామ్యం నెలకొంటే గాని రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ సాగించజాలదు అని అంబేద్కర్ స్పష్టపరిచారు. అందుకే అంబేద్కర్ బౌద్ధమత పునరుద్ధరణకు అవిరళ కృషి చేసినవాడు. ఆయనను ఆదర్శంగా చేసుకునే కాంగ్రెస్ ప్రభుత్వాలు నాటి నుంచి నేటి వరకు సామాజిక న్యాయ సాధనకు అగ్రతర ప్రాధాన్యమిచ్చి కృషి చేస్తున్నాయి. ఆయన మహోన్నత, మానవీయ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి నడుం బిగించడమే ఆయనకు మనం ఇవ్వగల సరైన నివాళి. ( వ్యాసకర్త చైర్మన్, ఏఐసీసీ, షెడ్యూల్డ్ కులాల శాఖ) రేపు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి కొప్పుల రాజు