సాక్షి, న్యూఢిల్లీ: పలు పథకాలకు నిధులు, సంస్థల మంజూరులో కేంద్రం తెలంగాణ పై వివక్ష చూపు తోందని మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రం తెలంగాణకు అన్ని రకాలుగా సహకారం అందిస్తోందని, విద్యాసంస్థలు, కేంద్ర పథకాలకు నిధుల మంజూరులో పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థల ఏర్పాటు విషయమై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను బుధవారం ఢిల్లీలో కలసి వినతిపత్రాన్ని ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో ఐఐటీ పనులను, గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాల న్నారు. ఇఫ్లూ వర్సిటీలో ఉద్యోగులకు కేంద్రమే 100% ప్రయోజనాలు కల్పించా లని, సెంట్రల్ వర్సిటీలో మౌలిక సదుపా యాల కల్పనకు నిధులు విడుదల చేయా లని కోరారు. సర్వశిక్షా అభియాన్, రూసా కింద తెలంగాణకు రూ.149 కోట్లు విడు దల చేసేందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment