గుంటూరు: డబ్బు తెచ్చేవారే ప్రస్తుత రాజకీయాల్లో ఇమడగలుతారని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయాలలో మహాత్మాగాంధీ లాంటి వారు కూడా ఇమడలేరని ఆయన తెలిపారు. ఆచార్య ఎన్జీరంగా 114 వ జయంతి సందర్భంగా పొన్నూరు సభకు హాజరైన రోశయ్య నేటి రాజకీయాలను ఉద్దేశించి ప్రసంగించారు. రాజకీయాలు డబ్బు మూటలకే పరిమితం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ర, కండబలంతో వచ్చేవారికి రాజకీయ పరిస్థితి లేదన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ లాంటి వారు కూడా నేటి రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టతరమన్నారు.