వైశ్యులకు ప్రభుత్వ పథకాలు అందాలి | Government schemes should Vysya | Sakshi
Sakshi News home page

వైశ్యులకు ప్రభుత్వ పథకాలు అందాలి

Published Mon, Jan 23 2017 1:15 AM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

Government schemes should Vysya

యాదగిరిగుట్ట : ఆర్యవైశ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని మైలార్‌గూడెంలో ఆదివారం జరిగిన ఇంటర్‌నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ యాదాద్రిభువనగిరి జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.  దేశంలో వైశ్య సంఘాలు ఎన్నో పుట్టుకొస్తున్నాయని, అవన్నీ నిరుపేదలకు సహాయం చేసేందుకు పోటీపడాలన్నారు.   తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి మాట్లాడుతూ భగవంతుడిచ్చిన వరం వైశ్యులని పేర్కొన్నారు.  ఘర్షణలు జరగకుండా ప్ర«శాంత జీవి తం గడపడంలో వైశ్యులు ముందుంటారని తెలిపారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. యా దాద్రి పుణ్యక్షేత్రంలో వైశ్యులు లోటస్‌టెంపుల్‌ ఏర్పా టుచేసి ఇక్కడికి వచ్చే భక్తులకు నిత్యన్నదానం చేయ డం సంతోషకరమని పేర్కొన్నారు.

ఐవీఎఫ్‌ నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంజి రాజమౌళిగుప్త, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జి ఉప్పల శ్రీనివాస్‌గుప్త మాట్లాడుతూ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి పేద వైశ్యులకు సహకారం చేయాలని కోరారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో త్వరలో నియమించే ట్రస్ట్‌ బోర్డులో వైశ్యులకు చోటు కల్పించాలని కోరారు.  అనంతరం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తాళ్లపల్లి విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి వంగపల్లి అంజయ్యగుప్త, కోశాధికారి తడ్క వెంకటేష్, మహిళ అధ్యక్షురాలు సముద్రాల కల్పన, యువజన సంఘం అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్‌ గుప్తతో పాటు కార్యవర్గ సభ్యులను ఉప్పల శ్రీనివాస్‌గుప్త ప్ర మాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్‌నేషనల్‌ మహిళ అధ్యక్షురాలు మలిపెద్ది మేఘమాల, చకిలం రమణయ్య, శింగిరికొండ నర్సిం హులు, ఉడుతా పురుషోత్తం, గౌరిశెట్టి ప్రభాకర్, పబ్బా చంద్రశేఖర్, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాలె సుమలత, నర్సింహమూర్తి, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement