రోశయ్యను క్షమాపణ కోరిన హోంమంత్రి
హైదరాబాద్: తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి క్షమాపణలు కోరారు. రోశయ్య అల్లుడి విషయంలో చేసిన ఆరోపణలపై ఆయన క్షమాపణ చెప్పారు.
మల్లెపల్లి పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)కు చెందిన భూమిని అక్రమంగా రోశయ్య అల్లుడికి కేటాయించారని తాను ఆరోపణలు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ విషయంలో రోశయ్య తనకు ఫోన్ చేశారని చెప్పారు. ఈ అంశంలో రోశయ్య అల్లుడికి సంబంధం లేదని విచారణలో తేలిందని చెప్పారు. గత ప్రభుత్వం కేటాయించిన భూమి వెనక్కు తీసుకుంటామని చెప్పారు.
కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తన అల్లుడికి చెందిన నియోనాటల్ ఇన్‌టెన్సివ్ కేర్ అండ్ ఎమర్జెన్సీస్(నైస్) ఆస్పత్రికి అప్పనంగా ఎకరా స్థలాన్ని కట్టబెట్టారని నాయిని అంతకుముందు ఆరోపించారు.