![CM KCR Pays Tribute To Former CM Konijeti Rosaiah - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/4/KCR1.jpg.webp?itok=f9F8M27Y)
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. రోశయ్య కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం కొంపల్లి ఫాంహౌస్‌లో రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు నిర్వహిస్తారు. రేపు ఉదయం వరకు అమీర్‌పేట్‌లోని నివాసంలోనే రోశయ్య భౌతికకాయం ఉండనుంది. రేపు ఉదయం గాంధీభవన్‌కు రోశయ్య భౌతికకాయం తరలిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 వరకు గాంధీభవన్‌లో భౌతికకాయం సందర్శనకు ఉంచనున్నారు. అనంతరం గాంధీభవన్ నుంచి అంతిమయాత్ర సాగనుంది. తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment