‘వస్తున్నాడు.. జగనన్న వస్తున్నాడు’ సాంగ్ సీడీని ఆవిష్కరిస్తున్న మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య
హైదరాబాద్: ప్రజల ఆశీర్వాదం, దేవుని దయతో ఏప్రిల్ 11న జరిగే సార్వత్రికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే మంచిదేనని తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కొణిజేటి రోశయ్య అభిప్రాయపడ్డారు. ప్రజల హృదయాలను దోచుకొన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో తనకు విడదీయలేని అనుబంధం ఉందని రోశయ్య గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ మాదిరిగానే ఆయన కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఎంతో కష్టపడుతున్నారని అభిప్రాయపడ్డారు.
గుంటూరుకు చెందిన సిమ్స్ విద్యా సంస్థల అధినేత భీమనాదం భరత్ రెడ్డి రూపొందించిన ‘వస్తున్నాడు.. జగనన్న వస్తున్నాడు’ ఆడియో అండ్ వీడియో సాంగ్ సీడీని కొణిజేటి రోశయ్య మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం ఆనాడు వైఎస్సార్ ఎంతో కష్టపడి పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఆయన మాదిరిగానే ప్రజల్లో ఒకడిగా వైఎస్ జగన్ తిరగటంతో ఆయనపై ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మారెడ్డి నరసారెడ్డి, ఇర్రి సిద్దార్థ, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment