సాక్షి, విశాఖపట్నం: నౌకాయాన రంగంలో దేశాన్ని అగ్రగామిగా నిలపాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఆయన విశాఖ పోర్ట్ ఛైర్మన్, అధికారులతో భేటీ అయ్యారు. ఉప రాష్ట్రపతికి ప్రజెంటేషన్ ద్వారా పోర్టు పురోగతి వివరాలను విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్ రామ్మోహన్ వెల్లడించారు. విశాఖ ట్రస్టు విస్తరణ ప్రణాళికలను ఉపరాష్ట్రపతి అభినందించారు.
ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థలో నౌకాశ్రయాల పాత్ర కీలకమన్నారు. దేశంలో పోర్టుల ఆధారిత అభివృద్ధిని విస్తృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాగర్‌మాల’ కార్యక్రమం చేపట్టిందన్నారు. 504 ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. సాగరమాల ద్వారా రూ.3.57లక్షల కోట్ల మౌలికవసతులు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, పోర్టు ట్రస్టు చైర్మన్ రామ్మోహన్‌రావు, డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే, సి.వి.వో ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.
చదవండి: విద్యాభివృద్ధికి ‘సాల్ట్’ పథకం: మంత్రి ఆదిమూలపు సురేష్
ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు..
Comments
Please login to add a commentAdd a comment