
సాక్షి, హైదరాబాద్: దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న వైద్య సేవల అంతరాన్ని తగ్గించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ అంతరాన్ని తగ్గించడం ద్వారా పల్లెల్లోనూ సరైన వైద్యసేవలు అందేలా కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ టెలి మెడిసిన్ ద్వారా కూడా గ్రామాల్లో ప్రాథమిక వైద్యసేవలను విస్తరిం చేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. ‘అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఆపి)’ 15వ అంతర్జాతీయ సదస్సు బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభ మైంది.
సదస్సులో ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. ‘దేశంలో ఇటీవలి కాలంలో వైద్య–సాంకేతిక సంస్థలు స్టార్టప్‌ల ద్వారా తమ సేవలను పెంపొందించేందుకు బాగా కృషి చేస్తున్నాయి. ఈ ప్రయత్నాల ద్వారా వైద్య ఖర్చులు తగ్గేందుకు వీలవుతుంది. భారత సంతతి వైద్యులు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్నారు’ అని చెప్పారు.
తాజా నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో తెలంగాణ సాధించిన ప్రగతిని వెంకయ్య అభినందించారు. ప్రతి ఏడాది ప్రగతిని సాధిస్తూ టాప్–3లో చోటు దక్కించు కోవడంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల దత్తత, ఇతర కార్యక్రమాల ద్వారా సెకండ్ వేవ్ సమయం లో ‘ఆపి’ ద్వారా అందిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు.
కరోనా అంతమెప్పుడో చెప్పలేం
కరోనా అనేక రకాలుగా పరివర్తన చెందుతుం డటంతో అది ఎప్పుడు అంతమవుతుందో చెప్పలే మని, అది ఉన్నంత వరకు ఆర్నెల్లకోసారి టీకా వేసుకోవాల్సిందేనని ‘ఆపి’ అధ్యక్షురాలు డాక్టర్ అనుపమ గొటిముకల అన్నారు. ఆమెతోపాటు ‘ఆపి’ సభ్యులు డాక్టర్ ఉదయ శివంగి, సుజిత్ పున్నం, సతీష్ కత్తుల మాట్లాడుతూ, వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని 75 గ్రామాలను తాము దత్తత తీసుకుం టున్నామని చెప్పారు.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి బీపీ, షుగర్, కిడ్నీ వంటి వ్యాధులను గుర్తిస్తామ న్నారు. ఎంబీబీఎస్ సీట్లకు సమానంగా పీజీ వైద్య సీట్లను పెంచాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. అన్ని మెడికల్ కాలేజీల్లో ఎమర్జెన్సీ మెడిసిన్, ఫ్యామిలీ మెడిసిన్, జీరియాట్రిక్ మెడిసిన్ తేవడానికి కృషిచేస్తామన్నారు. ‘ఆపి’ కృషిని ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment