జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: నాటకాలు సమాజంలోని పరిస్థితులను, వాస్తవ స్థితిగతులను ప్రతిబింబి స్తాయని, అలాంటి నాటకాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని భారత ఉప రాష్ట్రపతి ముప్ప వరపు వెంకయ్యనాయుడు చెప్పారు. సినిమా రంగంతో సమానంగా నాటక రంగానికి ప్రాధాన్యత పెరగాలని సూచించారు.
శుక్రవారం హైదరా బాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ సమావేశ మందిరంలో జరిగిన ‘నాటక సాహిత్యోత్సవం’ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి పాల్గొన్నారు. తెలుగు సాహితీ ప్రపంచంలో పేరెన్నికగన్న 100 ప్రసిద్ధ నాటకాల సంకలనంగా ‘తెలు గు ప్రసిద్ధ నాటకాలు’ పేరిట రూపొందిన 6 సంకలనా లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు.
పూర్వ వైభవం రావాలి: సమాజంపై ప్రభావం చూపిం చడంలో నాటకాల పాత్ర కీలకమని ఉప రాష్ట్రపతి చెప్పా రు. భాష ఉన్నతికి చిరునామాగా ఉంటూ, సామాజిక హితాన్ని కాంక్షిస్తూ, ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచే నాటకాలకు పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించారు. సినిమా వచ్చాక నాటకం బలహీన పడిందని చాలామంది అంటుం టారని కానీ తాను ఆ వాదనతో ఏకీభవించడం లేదని చెప్పారు. సినిమాతో సమానంగా నాట కాన్ని, దాని ప్రాధాన్యతను నిలబెట్టుకోవాలనేదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు.
ప్రోత్సాహానికి ముందుకు రావాలి
ప్రభుత్వాలే కాకుండా, ప్రైవేట్ సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు నాటక రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు ముందుకు రావాలని వెంకయ్య కోరారు. ప్రైవేట్ టీవీ ఛానెళ్ళు నాటకాలకు ప్రోత్సాహం అందించే ప్రయత్నాలు చేయాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల పిల్లలకు విద్యతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాల దిశగా ప్రోత్సాహం అందించాలన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో నాటక కళాకారుల పాత్రను అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, ఏపీ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఆంధ్ర నాటక కళా పరిషత్ అధ్యక్షులు బొల్లినేని కృష్ణయ్య, తెలుగు ప్రసిద్ధ నాటకాలు సంకలనాల సంపాద కులు వల్లూరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment