వెనకబడ్డ జిల్లాల అభివృద్ధికి కృషి | PM Modi video conference With CM Jagan and various states Chief Ministers | Sakshi
Sakshi News home page

వెనకబడ్డ జిల్లాల అభివృద్ధికి కృషి

Published Sun, Jan 23 2022 2:46 AM | Last Updated on Sun, Jan 23 2022 2:46 AM

PM Modi video conference With CM Jagan and various states Chief Ministers - Sakshi

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ. పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వెనకబడ్డ జిల్లాల్లో అభివృద్ధిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు తదితరులతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. వివిధ అంశాల్లో ప్రగతిపై నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా తమ తమ జిల్లాల్లో ప్రగతిని ఆయా జిల్లాల కలెక్టర్లు వివరించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాల కొండయ్య, పాఠశాల విద్యా శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ టి విజయ్‌కుమార్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement