
సాక్షి, అమరావతి: వర్షాలపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లు అందరూ అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. వర్షాల దృష్ట్యా అన్ని చోట్ల కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల అనంతరం వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment