పశ్చిమ బెంగాల్: యాస్ తుపాన్‌తో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం మమత బెనర్జీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాత్రికి సెక్రటేరియట్‌లోనే సీఎం మమత బెనర్జీ ఉండనున్నారు. నిరంతరం తుపాను పరిస్థితిని సమీక్షించనున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. కాసేపట్లో తీవ్ర తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.
ఆ తర్వాత అతి తీవ్ర తుపానుగా మారి, రేపు ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటేందుకు ఎక్కువ ఛాన్స్ ఉందని, తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. తుపాన్ ప్రభావం ఎక్కువగా ఒడిశా, పశ్చిమ బెంగాల్.. సిక్కిం రాష్ట్రాలపై, స్వల్పంగా జార్ఖండ్, బిహార్, అసోం, మేఘాలయ రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
చదవండి: Yaas Cyclone: తుపానుపై ఒడిశా అలర్ట్
యాస్, కరోనాను సమర్ధంగా ఎదుర్కొంటాం: సీఎం
Comments
Please login to add a commentAdd a comment