సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. అందులో భాగంగానే కోవిడ్‌పై తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర‍్యలపై ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ‍్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో కోవిడ్ సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొన్నప్పటికీ కేసులు పెరుగుతుండటం ఆందోళనకర అంశం. మనమంతా అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ సవాలును అధిగమించాలి. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయం చాలా ముఖ్యం..
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మన దేశ వయోజన జనాభాలో 96% మంది మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది.’’ అని అన్నారు. కాగా, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment