రేప్‌ చేసి వీడియో తీసి.. పైశాచిక డాక్టర్‌ | Doctor Arrested For Allegedly Molestation On Women In Muzaffarnagar UP | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 11 2018 4:50 PM | Last Updated on Mon, Jul 23 2018 8:51 PM

Doctor Arrested For Allegedly Molestation On Women In Muzaffarnagar UP - Sakshi

ముజఫర్‌నగర్‌, యూపీ : వైద్య వృత్తికే కళకం తెచ్చాడో నీచ వైద్యుడు. మెడికల్‌ చెకప్‌కు వచ్చిన మహిళపై అత్యాచారం జరిపి, దాన్ని వీడియో తీశాడు. సంవత్సర కాలంగా వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ.. ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దారుణమైన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదివారం వైద్యుడు సాజిద్‌ హసన్‌ను అరెస్టు చేశారు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. కైతోరా గ్రామానికి చెందిన మహిళ వైద్య పరీక్షలు చేయించుకునేందుకు సాజిద్‌ క్లినిక్‌కు వెళ్లింది.

సాజిద్‌ హసన్‌ ఆమెపై అత్యాచారం జరిపి, దాన్ని వీడియో తీసి ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచార నేరం కింద కేసు నమోదు చేసుకుని పోలిసు నిందితుడ్ని అరెస్టు చేశారు. కాగా గతం సంవత్సరం కూడా వైద్య పరీక్షల కోసం వచ్చిన 11 ఏళ్ల బాలికపై ఒక వైద్యుడు అత్యాచారం జరిపిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement