పిల్లి లాలాజలంతో పిల్లల టీకాలు! | vaccinations made from cat saliva and vodka, doctor arrested | Sakshi
Sakshi News home page

పిల్లి లాలాజలంతో పిల్లల టీకాలు!

Published Thu, Sep 29 2016 9:55 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

పిల్లి లాలాజలంతో పిల్లల టీకాలు!

పిల్లి లాలాజలంతో పిల్లల టీకాలు!

పిల్లల కోసం టీకాలు తయారుచేసే ఒక డాక్టర్.. వాటిని చేస్తున్న తీరు బయటపడటంతో.. అతడి లైసెన్సును అధికారులు సస్పెండ్ చేశారు. పిల్లుల లాలాజలం, ఓడ్కా కలిపి అతడు టీకాలు తయారుచేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. డాక్టర్ మింగ్ టె లిన్ అనే ఈ వైద్యుడు పిల్లలకు అనుమతిలేని టీకాలు ఇస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు సోదాలు చేశారు. అక్కడ ఏమాత్రం శుభ్రత లేకుండా ఉన్న ఆఫీసులో కొన్ని ఇంజెక్షన్ సీసాలు, ట్యూబులు కనిపించాయి. వాటితోనే డాక్లర్ లిన్ టీకాలు తయారుచేస్తున్నట్లు తెలిసింది. దాదాపు పదేళ్ల నుంచి తాను పిల్లల కోసం ప్రత్యామ్నాయ టీకాలు తయారుచేస్తున్నట్లు అతడు విచారణలో తెలిపాడు.

ఏడు రోజుల పసికందుతో సహా చాలామందికి అతడు ఈ టీకాలు ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో ఓడ్కా లాంటి మద్యాన్ని, మరికొన్ని సందర్భాల్లో పిల్లి నోటి నుంచి తీసిన లాలాజలాన్ని కూడా ఉపయోగించి.. ఎలర్జీతో బాధపడే పిల్లలకు టీకాగా ఇచ్చేవాడు. ఈ టీకాల నుంచి పాదరసాన్ని తీసేయడానికి 'వేవ్ ఫ్రంట్ 2000' అనే పరికరాన్ని ఉపయోగించాడు. కొన్నిసార్లు చుక్కల మందు రూపంలోను, మరికొన్నిసార్లు ముక్కులో స్ప్రే చేసుకునేవిధంగా ఈ టీకాలు ఇచ్చినట్లు ఒక పేషెంట్ కుటుంబ సభ్యులు తెలిపారు. అతడు అనుసరించే విధానాలకు గానీ, అతడి మందులకు గానీ అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి అనుమతి లేదు. అలాగే, ఈ మందులు వాడటం వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి కూడా అతడు రోగులకు చెప్పలేదు. ఈ వ్యవహారంపై చికాగోలో అక్టోబర్ 11న విచారణ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement