విజయవాడ: పెరిగిన పెట్రోల్ ధరలతో బైక్ బయటకు తీయాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. పోనీ సైకిల్ వాడుకుందామా అంటే ఎక్కువ దూరం తొక్కలేమనే భయం. ఈ సమస్యకు పరిష్కారమే సైకిల్ కమ్ బైక్. ఈ చిత్రంలో కనిపిస్తున్న (సైకిల్ కమ్ బైక్) వాహనాన్ని పుణేలోని ఈ–మోటోరాడ్ కంపెనీ తయారు చేసింది. దీని పేరు.. ‘డూడ్ల్’. ఈ వాహనం విలువ ఆన్ రోడ్డు+జీఎస్టీతో కలిపి రూ. 81,000. ఈ బైక్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. దీన్ని ఒకసారి రీఛార్జ్ చేస్తే గంటకు 25 కిలోమీటర్ల వేగంతో 45 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
సైకిల్ కమ్ బైక్ బ్యాటరీ వాహనంపై ప్రయాణిస్తున్న రాజేష్‌రెడ్డి. (ఇన్‌సెట్‌లో) ఫోల్డింగ్‌లో ఉన్న సైకిల్ కమ్ బైక్ వాహనం
దూర ప్రాంతాలకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లేటప్పుడు ఈ వాహనాన్ని ఫోల్డింగ్ చేసి తీసుకెళ్లొచ్చు. ఈ వాహనాన్ని విజయవాడలో ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న రాజేష్‌రెడ్డి కొనుగోలు చేశారు. ఆయన రోజూ దీనిపైనే విధులకు హాజరవుతుండటం విశేషం. దీనినే సైకిల్, బైక్‌లా వాడుకోవచ్చు. పైగా కాలుష్యం, ట్రాఫిక్ చలానాల జంఝాటాలు కూడా ఉండవు. సైకిల్ తొక్కేటప్పుడు ఏడు గేర్లు వేయడానికి వీలుంది. బైక్‌లా వాడాలంటే బ్యాటరీ ఆన్ చేసుకోవచ్చని రాజేష్‌రెడ్డి చెబుతున్నారు.
ఫొటోలు: విజయ్, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment