సైకిల్ పోలోలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
మామిడికుదురు :రాష్ట్ర స్థాయి 62వ స్కూల్ గేమ్స్ అండర్–19 సైకిల్ పోలో గేమ్స్–2016 టోర్నమెంట్‌లో జిల్లా క్రీడాకారుల బృందం ప్రతిభ చూపింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన ఇంటర్ డిస్రిక్ట్ పోటీల్లో బాలికల విభాగంలో రజత పతకం, బాలుర విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఈ పోటీలు జరిగాయని సైకిల్ పోలో కోచ్ జొన్నలగడ్డ గోపాలకృష్ణ సోమవారం తెలిపారు. బాలికల జట్టులో మామిడికుదురుకు చెందిన చింతపల్లి స్వర్ణరేఖ, కె.ఐశ్వర్య, ఎం.విజయకుమారి, ఉండ్రు అంబిక, బాలుర విభాగంలో పి.ఉదయ్‌కిరణ్, కె.వెంకటరమణ సభ్యులుగా ఉన్నారు.
జాతీయ పోటీలకు స్వర్ణరేఖ ఎంపిక
బాలికల విభాగం నుంచి పదో తరగతి విద్యార్థిని చింతపల్లి స్వర్ణరేఖ జాతీయ స్థాయి సైకిల్ పోలో పోటీలకు ఎంపికైంది. ఈ పోటీలు ఛత్తీస్‌గఢ్‌లో డిసెంబర్ నెలలో జరుగుతాయని కోచ్ గోపాలకృష్ణ తెలిపారు. సైకిల్ పోలో పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను హెచ్‌ఎం జేఎన్ ఎస్ గోపాలకృష్ణ, పీడీ వి.శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, పీఈటీలు అభినందించారు.