అది పాత సైకిలే.. కానీ వారి ఆనందం వెలలేనిది! | Emotional Video of Son Reactions After Father Buying Second Hand Bicycle | Sakshi
Sakshi News home page

అది పాత సైకిలే.. కానీ వారి ఆనందం వెలలేనిది!

Published Mon, Sep 25 2023 1:38 PM | Last Updated on Mon, Sep 25 2023 1:40 PM

Emotional Video of Son Reactions After Father Buying Second Hand Bicycle - Sakshi

ఒక్కోసారి చిన్నచిన్న ఆనందాలు కూడా వెలకట్టలేనంత సంతృప్తినిస్తాయి. ఎవరికైనా చిన్నతనంలో కుటుంబంతో గడిపిన ప్రతి క్షణం జీవితాంతం గుర్తుండిపోతుంది. మనం బాల్యంలో అందుకున్న చిన్నపాటి మిఠాయి కూడా మనల్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతుంది. ఇటీవల అటువంటి ఆనందాలను తిరగతోడే  వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఈ ఎమోషనల్ వీడియో చిన్నిచిన్ని సంతోషాలను ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలో నేర్పుతుంది. తండ్రీకుమారుల ఆనందం వీడియోలో స్పష్టంగా​ కనిపిస్తుంది. ఇది ఎవరి హృదయాన్నయినా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ 15 సెకన్ల వీడియోలో తండ్రీకొడుకులు తమ ఇంటి ముందు సైకిల్‌ దగ్గర నిలబడి ఉండటాన్ని గమనించవచ్చు. తరువాత తండ్రి ఆ సైకిల్‌కు పూలమాల వేసి, నీటిని చిలకరించిన తర్వాత, సైకిల్‌కు పూజ చేస్తాడు. దీనిని చూస్తూ పిల్లవాడు ఆనందంతో గెంతులేస్తుంటాడు. వీడియోలో కనిపిస్తున్న సైకిల్ పాతదే కావచ్చు కానీ వారి ఆనందం వర్ణించేందుకు వీలు కాకుండా ఉంది. ఈ వీడియోను ఐఎఎస్‌ అధికారి అవనీష్ శరణ్ తన  సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. వీడియోను షేర్ చేసిన ఆయన.. ‘ఇది సెకండ్ హ్యాండ్ సైకిల్ మాత్రమే. అయినా వారి ముఖాల్లో సంతోషాన్ని ఒక్కసారి చూస్తే.. కొత్త మెర్సిడెస్ బెంజ్ కొన్నట్లుగా  ఉంది.

ఈ వీడియోను ఇప్పటివరకూ 85 వేల మందికి పైగా లైక్ చేయగా, 3 వేల మందికి పైగా యూజర్లు వీడియోపై తమ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఒక యూజర్‌ ‘బహుశా ప్రపంచంలోని ఖజానానంతా వెచ్చించినా ఇంతటి ఆనందాన్ని కొనుగోలు చేయలేకపోవచ్చు’ అని రాశారు. మరొక యూజర్‌ ‘వీరి సంతోషానికి ధర లేదు సార్’ అని రాశారు. అయితే కొంతమంది వినియోగదారులు ఈ వీడియోను షేర్‌  చేసే బదులు మీరు వారికి కొత్త సైకిల్ కొనుగోలు చేసి ఇవ్వవచ్చుకదా అని ఆ ఐఏఎస్‌ అధికారికి సూచించారు. 
ఇది కూడా చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డుల రద్దు? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement