సోలార్ సైకిల్
–ఇంజనీరింగ్ విద్యార్థుల అవిష్కరణ
గోనెగండ్ల: తొక్కకుండా నడిచే సోలార్ సైకిల్.. కర్నూలు బృందావన్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థుల ఆవిష్కరణ. శుక్రవారం గోనెగండ్లలో ప్రయోగాత్మకంగా దానిని నడిపి చూపించారు. ఎమ్మిగనూరుకు చెందిన మహమ్మద్ రఫీక్, ఉదయ్‌కుమార్, కర్నూలుకు చెందిన కిరణ్‌స్వామి, సూర్యదీప్, రాజేష్ అనే విద్యార్థులు..సైకిల్‌కు సోలార్ ప్యానెల్‌తో పాటు బ్యాటరీ, మోటర్ అమర్చారు.
ఇందుకు రూ. 10వేలు ఖర్చు చేశారు. పదిరోజుల కృషి ఫలితం..సోలార్ ద్వారా 24 ఓల్ట్‌ల విద్యుత్ ఉత్పత్తి గంటకు 25 కిలో మీటర్ల వేగంతో రయ్యిమంటూ దూసుకెళ్లే సైకిల్ తయారైంది. దీనిపై 4గంటల మేర ప్రయాణం చేయవచ్చని ఇంజినీరింగ్ విద్యార్థి మహమ్మద్ రఫీక్ తెలిపారు. ఎండ లేనప్పుడు విద్యుత్‌తో బ్యాటరీని చార్జింగ్ 2 గంటల పాటు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. సైకిల్ తయారీకి కళాశాల అధ్యాపకులు కైలాస్ కృష్ణప్రసాద్, ఒన్నూరప్పతో పాటు గోనెగండ్లకు చెందిన టెక్నిషియన్ మజీద్‌బాషాలు సహకారం అందించినట్లు చెప్పారు.